వాళ్లు వద్దంటే మీరెలా ఊరుకున్నారు.. ? మహిళ జర్నలిస్టులపై ఇంత వివక్షా? కేంద్రంపై రాహుల్ ఫైర్

వాళ్లు వద్దంటే మీరెలా ఊరుకున్నారు.. ? మహిళ జర్నలిస్టులపై ఇంత వివక్షా? కేంద్రంపై రాహుల్ ఫైర్

ఆఫ్ఘనిస్తాన్​ విదేశాంగ మంత్రి ముత్తాకీ ప్రెస్​ మీట్​ లో మహిళా జర్నలిస్టులను మినహాయించడాన్ని  పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్​ తీవ్రంగా విమర్శించారు. ఇది మహిళ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు.  మహిళా జర్నలిస్టులపై వివక్ష ఏంటనీ ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. లింగ సమానత్వం, ప్రజాస్వామ్య హక్కుల పట్ల భారత్​ నిబద్ధతను ఎత్తిచూపారు. న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్​ విదేశాంగ మంత్రి అమీర్​ ఖాన్​ ముత్తాకీ  ప్రెస్​ మీట్​ లో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. 

న్యూఢిల్లీలో తాలిబన్​  ప్రెస్​ కాన్ఫరెన్స్​ లో మహిళ జర్నలిస్టులను నిషేధించడం పై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు రాహుల్​ గాంధీ. ఈ చర్యతో మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న  చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. 

మన దేశంలో ప్రతి రంగంలోనూ మహిళలకు సమాన భాగస్వామ్య హక్కు ఉంది. అటువంటి మహిళలు వివక్షను ఎదుర్కొంటున్న సమయంలో మీరేం చేస్తున్నారు.. మౌనం నారీ శక్తిపై మీ నినాదాల అంతా ఉత్తదేనా అన్ని ప్రశ్నించారు. 

►ALSO READ | 42వేల కోట్లతో రెండు కొత్త పథకాలకి ప్రధాని మోదీ శ్రీకారం.. రైతులకి ప్రత్యక్షంగా ప్రయోజనం.. పెరుగనున్నా పప్పుధాన్యాల ఉత్పత్తి...

శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కనిపించలేదు. కొంతమంది మహిళా జర్నలిస్టులను సమావేశంలోకి ప్రవేశించకుండా ఆపారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రెస్ మీట్ తర్వాత చాలా మంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ,అందరు మహిళా రిపోర్టర్లు దుస్తుల కోడ్‌ను గౌరవించారని కూడా ఎత్తి చూపారు.

మరోవైపు ఈ వివాదంలో కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేసింది విదేశాంగ మంత్రి శాఖ..ప్రెస్ మీట్​కు ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్​ కాన్సుల్​ జనరల్ నుంచి ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆహ్వానాలు అందాయి. వారు ఆఫ్ఘన్​ మంత్రి పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు.  ఆఫ్ఘన్​ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది.