Women Health : మహిళల్లో డీటాక్స్ సిగ్నల్స్ గుర్తించటం ఎలా

Women Health : మహిళల్లో డీటాక్స్ సిగ్నల్స్ గుర్తించటం ఎలా

బిజీ లైఫ్ స్టయిల్ కారణంగా చాలామంది హెల్దీ డైట్ ఫాలో కావట్లేదు. దీనికి తోడు మానసిక ఒత్తిడి, పొల్యూషన్ వల్ల శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. ఇవి ఆర్గాన్స్, టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తాయి. టాక్సిన్లు ఎక్కువైనప్పుడు బాడీలో ఆటోమెటిక్ గా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ అలా జరగనప్పుడు శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అంటున్నారు. న్యూట్రిషనిస్ట్ రుచి శర్మ. అవేమిటంటే...

రెగ్యులర్ గా అజీర్తి, జీర్ణపరమైన సమస్యలు వస్తున్నాయంటే శరీరంలో టాక్సిన్లు పెరిగా యని, డీటాక్స్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చిందని గ్రహించాలి. టాక్సిన్లను బయటికి
పంపించే డీటాక్సిఫికేషన్ లివర్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే డీటాక్స్ సిగ్నల్స్ కాలేయం మీద ఒత్తిడి ఎక్కువై ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తొందరగా అలసిపోవడం

ఒక్కోసారి కంటినిండా నిద్రపోయినా కూడా రోజంతా హుషారుగా అనిపించదు. తొందరగా అలసిపోతుంటారు. అందుకు కారణం టాక్సిన్లు. అలసి పోయినప్పుడు అడ్రినల్ మీద ఒత్తిడి ఎక్కువైతుంది. టాక్సిన్ల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గ్లాండ్స్ పనితీరు మారుతుంది.

మూడ్ స్వింగ్స్

తరచుగా మూడ్ స్వింగ్స్ ఉంటున్నా, నిద్రలేకపోయినా, ఆందోళన పడుతున్నా.. ఒంట్లో టాక్సిన్లు పెరిగాయని గమనించాలి. కొన్నిరకాల టాక్సిన్లు హార్మోన్ల పనితీరుని దెబ్బతీస్తాయి. మరికొన్ని అయితే మెదడులోని కణాల్ని సైలెంట్ చేస్తాయి. దాంతో మూడ్ స్వింగ్స్ ఎక్కువైతాయి.

బరువులో హెచ్చుతగ్గులు

క్యాలరీల లెక్క పక్కాగా ఉన్నాకూడా కొందరు బరువు పెరుగుతారు. లేదా బరువు తగ్గుతారు. అందుకు కారణం అడిపోస్ టిష్యూస్ (ఫ్యాట్ డీటాక్స్ అనగానే కూరగాయలు, పండ్ల రసాలు తాగినా, ఉపవాసం ఉన్నా సరిపోతుంది అనుకుంటారు చాలా మంది. డీటాక్స్ అనేది బయలాజికల్ ప్రాసెస్. చెమట, ఊపిరి, యూరిన్ రూపంలో శరీరంలోని మలినాల్ని, వేసి ని బయటకి పంపించే నిరంతర ప్రక్రియ. సెల్స్) టాక్సిన్లకి అంటుకుని ఉంటాయి. దాంతో శరీరం వీటిని ఇతర కణాలుగా పొరబడి వాటిని వదిలేస్తుంది. ఇలా జరుగుతుంటే శరీరాన్ని డీటాక్స్ చేసుకోవాలని గ్రహించాలి.

డయేరియా

డైట్ లో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గినప్పుడు. శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. ఈ టాక్సిన్లు రక్తంలో కలిసి కొన్నిసార్లు డయేరియాకి కారణమవుతాయి. అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు బాడీని డీటాక్స్ చేసుకోవడం ముఖ్యం.