Women Ipl Auction: రికార్డు ధర పలికిన విమెన్ ఐపీఎల్ జట్లు

Women Ipl Auction: రికార్డు ధర పలికిన విమెన్ ఐపీఎల్ జట్లు

విమెన్ ఐపీఎల్ జట్ల వేలం పాట ముగిసింది. ముంబైలో జరిగిన వేలంలో దేశంలోని టాప్ కంపెనీలు జట్లను సొంత చేసుకునేందుకు పోటీ పడ్డాయి. మొదటి లీగ్ లో 5 టీంలు పాల్గొంటాయని బీసీసీఐ ప్రకటించగా మెన్ ఐపీఎల్ నుంచి ఏడు ఫ్రాంచేజీలు కూడా వేలంలో పాల్గొన్నాయి. అయితే, ఈ వేలంపాటలో జట్లకు రికార్డ్ ధర పలికడంతో బీసీసీఐకి రూ. 4,669 కోట్లు వచ్చింది. ఈ వేలం పాట 2008 మెన్ ఐపీఎల్ వేలాన్ని అధిగమించిందని బీసీసీఐ సెక్రెటరీ జైషా ట్వీట్ చేశాడు. 

వేలంలో పాల్గొన్న అదానీ స్పోర్ట్స్ లైన్ సంస్థ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 1289 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు ముంబైను ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.912.99 కోట్లకు సొంతం చేసుకుంది. బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లకు, ఢిల్లీ టీంను జేఎస్ డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లకు, లక్నో జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్ రూ. 757 కోట్లకు దక్కించుకున్నాయి. విమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 వరకు జరిగే అవకాశం ఉంది.