కరోనా వైరస్ నకిలీ వ్యాక్సిన్ల అమ్మకం.. పోలీసుల అదుపులో మహిళలు

కరోనా వైరస్ నకిలీ వ్యాక్సిన్ల అమ్మకం.. పోలీసుల అదుపులో మహిళలు

కరోనా వైరస్ వ్యాక్సిన్లపేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ముగ్గురు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్ర జల్నా జిల్లాలో ముగ్గురు మహిళలు రాధా రామ్‌నాథ్ సామ్సే, సీమ కృష్ణ అంధాలే, సంగీత రాజేంద్ర అవద్‌లు వైద్యులుగా, హెల్త్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నామంటూ నకిలీ కరోనా వైరస్ వ్యాక్సిన్ లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.

జల్నా జిల్లాలోని  పిపాల్‌గోవాన్ గ్రామస్తులను కలుసుకున్న ఈ ముగ్గురు మహిళలు తమ వద్ద  కరోనా వైరస్ నుండి రక్షించగలిగే వ్యాక్సిన్ ఉందని గ్రామస్తుల్ని నమ్మించారు. వారికి నకిలీ వైరస్ వ్యాక్సిన్లను అందించింది. పెద్ద మొత్తంలో వసూలు చేశారు.

అదే సమయంలో కొంతమంది గ్రామస్తులు గ్రామీణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి  డాక్టర్ మహాదేవ్ ముండేకు ఈ విషయం తెలియ జేశారు. గ్రామస్తుల సమాచారంతో మహాదేవ్ పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు పక్కా పగడ్బందీగా  నకిలీ వ్యాక్సిన్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  ప్రజల్ని మోసం చేస్తున్న ముగ్గురు మహిళలపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.