ఫ్రీ జర్నీతో మహిళలకు రూ.535 కోట్ల లబ్ధి

ఫ్రీ జర్నీతో మహిళలకు రూ.535 కోట్ల లబ్ధి

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈనెల 6 వరకు 15.21 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ చేశారని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు ఇప్పటి వరకు రూ.535.52 కోట్ల లబ్ధి చేకూరిందని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ జర్నీని ప్రారంభించగా, శుక్రవారం నాటికి రెండు నెలలు కానుంది.

కాగా,  ఆర్టీసీలో 100 కొత్త బస్సులు రానున్నాయి. ఇందులో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ఎక్కువ ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిని త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బస్సులు వస్తున్న నేపథ్యంలో మేడారం జాతరకు ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు.

Also Read : కోహ్లీ ఆడకపోతే ఎలా?