మహిళలు వ్యాపారంలో రాణించాలి ..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మహిళలు వ్యాపారంలో రాణించాలి ..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల,వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కిందని, మహిళలు వ్యాపారంలో రాణించి స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. బుధవారం గంభీరావుపేటలో శ్రీ మణికంఠ గ్రామ సమాఖ్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాన్ని ఏఎంసీ పాలకవర్గ సభ్యులతో కలిసి కలెక్టర్​ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్,ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామన్నారు. 

మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 23 ఎరువుల దుకాణాలు  ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జల్ బేగం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ విజయ, వైస్ చైర్మన్ అంజిరెడ్డి పాల్గొన్నారు.