ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్ నగర్/గరిడేపల్లి, వెలుగు: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని, అందుకు  తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. మంగళవారం హుజూర్ నగర్ లోని జూనియర్ కాలేజీలో ‘న్యాక్’  ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులకు కుట్టు మిషిన్లు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి  చేస్తోందన్నారు. జక్కుల నాగేశ్వరరావు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హసీబ్ తదితరులు పాల్గొన్నారు.

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

 రాష్ట్రంలో రైతులను రాజులుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో రూ. 1. 2 కోట్లతో  చేపట్టిన పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  మీటింగ్​లో  మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చే ఆదాయంతో  రోడ్లు నిర్మించనున్నట్లు  ఎమ్మెల్యే చెప్పారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంక ట్​రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత , సర్పంచ్  సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నిఖిల్ హంతకులను శిక్షించాలి

సూర్యాపేట, వెలుగు: గిరిజన స్టూడెంట్​ధరావత్​నిఖిల్​ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో  నిరసన ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ నిఖిల్ హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్  చేశారు. కొందరు ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పోలీసులు  నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  నాయకులు ములకలపల్లి రాములు, యాతకుల రాజయ్య, కోట గోపి, వాంకుడోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రీ రిపబ్లిక్ పరేడ్ కు ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఎంపిక

నల్గొండ అర్బన్​, వెలుగు : వెస్ట్ జోన్  ప్రీ రిపబ్లిక్ పరేడ్ కు నల్గొండలోని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్ల నుంచి వలంటీర్లను మంగళవారం ఎంపిక చేశామని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీజినల్ డైరెక్టర్ హైదరాబాద్​ యూత్ ఆఫీసర్ సైదా నాయక్ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయన్నారు. ఈ ఎంపికలో రన్నింగ్ మార్చ్, పరేడ్ ఆర్ట్స్​హిందీ, తెలుగు భాషా పరిజ్ఞానం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేశామన్నారు. ఎన్ఎస్ఎస్  వలంటీర్ల స్కిల్స్​పెంచే దిశగా భారత ప్రభుత్వం గుజరాత్ లో పరేడ్​ నిర్వహించనుందన్నారు. హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ , పీవోలు డాక్టర్ మశ్చేందర్, రామచంద్రుడు  తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత కోసం వినూత్న ప్రచారం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పరిసరాల పరిశుభ్రత కోసం ఓ కౌన్సిలర్ సాన్పి జల్లి ముగ్గు వేసి వినూత్నంగా ప్రచారం చేశారు. ‘గుట్ట’ మున్సిపాలిటీలోని 12వ వార్డులో (ప్రశాంత్ నగర్) కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇండ్ల ముందే వ్యర్థపదార్థాలు, చెత్త పడేస్తుండడంతో దుర్వాసన వస్తోంది.  గమనించిన  కౌన్సిలర్  మౌనిక స్థానిక మహిళలతో కలిసి ఉదయమే వెళ్లి శాంపి చల్లి ముగ్గులు వేసి మొక్కలు నాటారు. అంతేకాకుండా ‘ఇచ్చట చెత్త పడేయరాదు’, ‘చెత్త వేస్తే రూ.500 జరిమానా’ అని   ముగ్గుతో రాసి అవగాహన కల్పించారు.దీంతో స్థానికులు కౌన్సిలర్​పని తీరును అభినందించారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ..  చెత్తను డబ్బాల్లో వేరు చేసి మున్సిపల్​బండిలో వేయాలని సూచించారు.  గుజ్జ నిర్మల, కృష్ణవేణి, సోమేశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

పీఏసీఎస్​ చైర్మన్ల సమస్యలు పరిష్కరించండి

నల్గొండ, వెలుగు : పీఏసీఎస్​ చైర్మన్లు సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఫోరం నాయకులు మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతి భవన్ లో చైర్మన్లు కేటీఆర్​ను కలిసి తమ సమస్యలు  వివరించారు. చైర్మన్లకు  ప్రొటోకాల్ ​హానరోరియం కల్పించాలని కోరారు.  ఈ సందర్భంగా కేటీఆర్   మాట్లాడుతూ.. చైర్మన్లు వ్యవసాయ రంగం అభివృద్ధికి చేస్తున్న సేవలు తనకు తెలుసునని,  చైర్మన్లు  సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఫోరం రాష్ట్ర  అధ్యక్షుడు ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల కరుణాకర్ రావు , మంజుల రెడ్డి, సంధ్యాల వెంకటేశ్​తదితరులు పాల్గొన్నారు. 

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో రైతులను రాజులుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో రూ. 1. 2 కోట్లతో  చేపట్టిన పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  మీటింగ్​లో  మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చే ఆదాయంతో  రోడ్లు నిర్మించనున్నట్లు  ఎమ్మెల్యే చెప్పారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంక ట్​రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత , సర్పంచ్  సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

డెడ్​బాడీలు వెలికితీత

తుంగతుర్తి, వెలుగు:- మండలంలోని వెలుగుపల్లి శివారు.. రుద్రమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి  చెరువులో మునిగి గల్లంతైన ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. పోలీసుల వివరాల ప్రకారం..  జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి తండాకు చెందిన గుగులోతు వీరన్న (35), నూతనకల్​ మండలం టీక్యాతండాకు చెందిన భూక్య భిక్షం (33) సోమవారం  చేపల వేటకు వెళ్లి కాళ్లకు నాచు చుట్టుకోవడంతో చెరువులో మునిగిపోయారు. తుంగతుర్తి, అర్వపల్లి మండలాల తహసీల్దార్లు, పోలీసులు  చెరువులో ఎంత వెతికినా లాభం లేకపోవడంతో మంగళవారం గజ ఈతగాళ్లను రప్పించి నాటు పడవల ద్వారా గాలించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్​మేరకు  కేసు  ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం  తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.  

పైలేరియా నివారణకు కృషి చేయాలి

సూర్యాపేట, వెలుగు: పైలేరియా ( బోదకాలు) వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ  కృషి చేయాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో  పైలేరియా నివారణ మందులను పంపిణీ కార్యక్రమంపై అధికారులతో మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పైలేరియాను తరిమి కొట్టాలన్నారు. జిల్లాలో ఈ నెల 20 నుంచి ఫైలేరియా నివారణ మందులు పంపిణీ షురూ అవుతుందన్నారు. 2,306 ప్రత్యేక బృందాలు  డీఈసీ, ఆల్బెండజోల్​మెడిసిన్స్​పంపిణీ చేస్తారని చెప్పారు. డీఎంహెచ్​వో డాక్టర్ కోట చలం, ఇమ్యూనైజేషన్​ఆఫీసర్​డాక్టర్ నాజియా, డిఫ్యూటీ డీఎంహెచ్​వో లు తదితరులు పాల్గొన్నారు.

రసాభాసగా కౌన్సిల్ ​మీటింగ్​

లేఅవుట్​ స్థలాలు కాపాడాలని కౌన్సిలర్ల డిమాండ్

హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్​ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. 23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య నల్ల చొక్కాతో హాజరై వీపీఆర్  వెంచర్  లేఅవుట్  స్థలాలు కాపాడాలని, వెంచర్ అనుమతులను రద్దు చేయాలని  మీటింగ్ హాలులో నిరసన తెలిపారు. లే అవుట్ స్థలాల అగ్రిమెంట్ల వివరాలు ఇవ్వాలని ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, తేజావత్ రాజా, వెలిదండ సరిత, వేముల వరలక్ష్మి, బోలెద్దు ధనమ్మ, కారింగుల విజయ పట్టుబట్టారు. పూర్తి వివరాలు ఇస్తానని కమిషనర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.10 నెలల తరువాత కౌన్సిల్  సమావేశం జరపడంతో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు పట్టణ సమస్యలను కమిషనర్  దృష్టికి తీసుకెళ్లారు. వార్డు సమస్యలు తీర్చలేక, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించక పోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో ఇన్​చార్జిలను కాకుండా ఫుల్ టైం ఆఫీసర్లను నియమించాలని డిమాండ్ చేశారు. వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించి,అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో వార్డులకు కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతి నెలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాదిగా సిబ్బందికి యూనిఫాం, కాస్మోటిక్స్  ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని కోరారు. 15 ఫైనాన్స్ నిధుల నుంచి ఒక్కో వార్డుకు రూ.20 లక్షలు ఇవ్వాలన్న  తీర్మానాన్ని ఆమోదించారు.