వచ్చే ఏడాది నుంచి విమెన్స్ ఐపీఎల్

వచ్చే ఏడాది నుంచి విమెన్స్ ఐపీఎల్

న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విమెన్స్‌‌‌‌ ఐపీఎల్‌‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్స్‌‌ రెడీ చేస్తోంది. ఐదు జట్లతో 20 లీగ్‌‌ మ్యాచ్‌‌లు ఉండేలా షెడ్యూల్‌‌ను రూపొందిస్తోంది. ప్రతి జట్టు పరస్పరం రెండు మ్యాచ్‌‌లు ఆడనున్నాయి. టేబుల్‌‌ టాపర్‌‌ డైరెక్ట్‌‌గా ఫైనల్‌‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు ప్లేస్‌‌ల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌ను నిర్వహిస్తారు. ప్రతి జట్టు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఐదుగురు ఫారిన్‌‌ ప్లేయర్లకు చాన్స్‌‌ ఇవ్వనున్నారు. ప్రతి టీమ్‌‌లో గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉంటారు. ఏ టీమ్‌‌ ఆరుగురి కంటే ఎక్కువగా విదేశీ ప్లేయర్లను తీసుకోకూడదు. ఇందులో ఐదుగురు ఐసీసీ సభ్య దేశాల నుంచి ఒక్కరు అసోసియేట్‌‌ కంట్రీ నుంచి ఉండేలా డ్రాఫ్ట్‌‌ను రూపొందించారు.

ఫ్రాంచైజీల కోసం ప్రతి జోన్‌‌కు రెండు నగరాలను షార్ట్‌‌ లిస్ట్‌‌ చేశారు. ధర్మశాల / జమ్మూ (నార్త్‌‌ జోన్‌‌), పుణె / రాజ్‌‌కోట్‌‌ (వెస్ట్‌‌ జోన్‌‌), ఇండోర్‌‌ / నాగ్‌‌పూర్‌‌/ రాయ్‌‌పూర్‌‌ (సెంట్రల్‌‌), రాంచీ/ కటక్‌‌ (ఈస్ట్‌‌), కొచ్చి / వైజాగ్‌‌ (సౌత్‌‌), గౌహతి (నార్త్‌‌ఈస్ట్‌‌) ఇందులో ఉన్నాయి. డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ ప్లేయర్లను బ్యాలెన్స్​ చేసేందుకే పరిమితి పెట్టామని బోర్డు వర్గాలు తెలిపాయి.