రేపు విమెన్స్​ ఫ్రాంచైజీల వేలం​

రేపు విమెన్స్​ ఫ్రాంచైజీల వేలం​
  • 5 జట్లకు 30 కంపెనీలు పోటీ
  • 6 మెన్స్​ ఐపీఎల్​ ఫ్రాంచైజీల ఆసక్తి

న్యూఢిల్లీ: విమెన్స్​ ఐపీఎల్ (డబ్ల్యూఐపీఎల్​)​ వేలం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్లు రాబట్టేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ మేరకు ఐదు టీమ్స్​ కోసం బుధవారం ఆక్షన్​ జరగనుంది. మెన్స్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌లోని ఆరు ఫ్రాంచైజీలతో పాటు బడా కంపెనీలు రంగంలోకి దిగడంతో.. ఒక్కో జట్టు రూ. 500 నుంచి 600 కోట్ల మధ్య అమ్ముడయ్యే చాన్స్​ ఉందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ‘డబ్ల్యూఐపీఎల్​కు కూడా భారీ స్పందన ఉంటుంది. ఇప్పటికే మెన్స్​ టీమ్స్​ను కొనుగోలు చేసిన పలు ఫ్రాంచైజీలు బరిలో ఉన్నాయి. దీంతో కొన్ని విమెన్స్​ టీమ్స్​కు రూ. 500 కోట్ల వరకు బిడ్స్​ రావొచ్చు. మరికొన్నింటికి రూ. 800 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఓవరాల్​గా రూ. 4 వేల కోట్ల వరకు రావొచ్చు’ అని గతంలో మెన్స్​ ఐపీఎల్​ కోసం పని చేసిన ఓ వ్యక్తి వెల్లడించాడు.

విమెన్స్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ కోసం  ముంబై, కేకేఆర్‌‌‌‌, సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, ఆర్‌‌‌‌సీబీ ఇప్పటికే టెక్నికల్‌‌‌‌ బిడ్లు దాఖలు చేశాయి. సీఎస్‌‌‌‌కే, గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ మాత్రం బిడ్లు వేయలేదు. ఓవరాల్‌‌‌‌గా  విమెన్స్​ టీమ్స్​ కోసం మొత్తం 30కి పైగా కంపెనీలు బిడ్స్​ను కొనుగోలు చేశాయి. అదానీ, టొరెంట్​​, హల్దీరామ్స్​ గ్రూప్స్​​, కాప్రీ గ్లోబల్​, కోటక్​ అండ్​ ఆదిత్య బిర్లా గ్రూప్​ రేసులో ఉన్నాయి. 2021లో మెన్స్​ టీమ్స్​ కోసం పోటీపడి దక్కించుకోలేకపోయిన కొన్ని బిజినెస్​ గ్రూప్స్.. విమెన్స్​ టీమ్స్​పై ఎక్కువగా దృష్టి పెట్టాయి.