Women Special : ఇట్ల చేస్తే అమ్మాయిల చర్మం దెబ్బతింటది.. బీ కేర్ ఫుల్

Women Special : ఇట్ల చేస్తే అమ్మాయిల చర్మం దెబ్బతింటది.. బీ కేర్ ఫుల్

అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. వంటింటి చిట్కాలనీ ఫాలో అవుతుంటారు. అయితే ప్రతి స్కిన్ ప్రాబ్లంకి ప్రొడక్ట్స్ వాడటమే సొల్యూషన్ కాదు.

  • మెరిసే చర్మం కోసం మార్కెట్ లో పూటకో ప్రొడక్ట్ రిలీజ్ అవుతుంటుంది. కానీ, వాటితో పనిలేకుండా రోజులో కొద్దిసేపు డాన్స్ చేస్తే చాలు. డాన్స్ కు, ముఖం మెరుపుకు లింక్ ఏంటి? అంటారా. ఈ రెండింటికి చాలా దగ్గరి సంబంధం ఉంది. 
  • డాన్స్ లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమట ఎక్కువ వస్తుంది. అంటే ఆయిల్, దుమ్ము, ధూళితో నిండిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చెమట వల్ల చర్మం క్లీన్ అయ్యి యాక్నె సమస్యలు రావు. 
  • స్కిన్ ఇన్ఫ్ మేషన్ ని తగ్గించే హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. దానివల్ల తామర, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. 
  • అలాగే డాన్స్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, చర్మ కణాలకి సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో నేచురల్గానే చర్మం మెరుస్తుంది.
  • ప్రతి 28 రోజులకి చర్మం దానంతట అదే క్లీన్ అవుతుంది. నెలకోసారి చర్మం కొత్త కణాలని తయారు చేసుకుంటుంది. అందువల్ల చర్మానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. అలాగని ఇట్ల చేస్తే చర్మం దెబ్బతింటది.
  • బేసిక్ స్కిన్ కేర్ ని పక్కన పెట్టకూడదు. హెల్దీ స్కిన్ కోసం సరిపడా నీళ్లు తాగాలి. పండ్లు, ఆకుకూరలు వీలైనంత ఎక్కువ తినాలి. ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. 
  • ముప్పై యేళ్లకే చర్మం ముడతలు పడుతోంది. చాలామందికి. ఆ ముడతల్ని తగ్గించడానికి వరుసగా ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. 
  • కానీ, కాస్త ముందు జాగ్రత్త తీసుకుంటే ఆ ప్రొడక్ట్స్ పనే లేదు. ముఖ్యంగా కెఫిన్ తక్కువ తీసుకుంటే చాలు. కెఫిన్ స్ట్రెస్ హార్మోని ని పెంచుతుంది. 
  • దానివల్ల సెబేషియస్ (నూనె) గ్రంథుల నుంచి ఆయిల్ ఎక్కువ వచ్చి యాక్నె సమస్యలు వస్తాయి. చర్మంపై ముడతలు పడతాయి. అందుకే దూరంగా ఉండాలి.
  • మనం పడుకునే పొజిషన్ పై కూడా చర్మ ఆరోగ్యం ఆధారపడుతుందని తెలుసా!. అదెలాగంటే.. చాలామంది నిద్రపోయేటప్పుడు దిండుపై ముఖం పెట్టి బోర్లా పడుకుంటుంటారు. 
  • దానివల్ల స్కినికి సరిపడా గాలి అందదు. దాంతో చర్మరంధ్రాలు మూసుకుపోయి యాక్నె సమస్యలు వస్తాయి. చర్మంపై గీతలు కూడా పడతాయి. అందుకే ఎప్పుడూ ముఖానికి గాలి తగిలేలా వెల్లకిలా పడుకోవాలి. అలాగే పిల్లో కవర్స్ శుభ్రంగా లేకపోయినా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. 
  • నీడపట్టునుంటే యువి కిరణాలు చర్మంపై పడవనుకుంటారు. కానీ, అది అపోహ మాత్రమే. యువీ రేస్ లో యువి-ఏ.యువి -బి అనే రెండు రకాలుంటాయి. యువిబి కిరణాలు కిటికీలు, తలుపుల్ని దాటుకుని రావు. కానీ, యువిఏ కిరణాలు ఇంట్లోకి వస్తాయి. చర్మంపై ముడతలకి కారణం మొటిమలు, యాక్నె సమస్యలు కూడా వస్తాయి. 

Also Read :- అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్

  • దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇంట్లో ఉన్నా సన్  స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాయాలి. అయితే ప్లాంట్ బేస్డ్ సన్ లోషన్స్ వాడటం బెటర్. బ్యూటీ అవుతాయి. 
  • స్కిన్ ఏజింగ్ కి కారణం జీన్స్ అనుకుం టారు. కానీ, చర్మంపై ముడతలు, మచ్చలు, చర్మం సెన్సిటివ్ మారడానికి, లూజ్ అవ్వడానికి కారణం జీన్స్ కాదు.
  • చర్మానికి ఎండ ఎక్కువగా తగలడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. అందుకే బయటికి వెళ్లేటప్పుడు ఎస్పిఎఫ్ క్రీమ్స్ (సన్ ప్రొటక్షన్ ఫార్ములా) కచ్చితంగా వాడాలి. 
  • ఏ స్కిన్ టైప్కి అయినా 5.5 పీహెచ్ లెవల్ ఉంటుంది. అది చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. కానీ, చాలామంది ఈ విషయం పట్టించుకోకుండా ఎసిడిక్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. 
  • ఆల్కలైన్ తో నిండిన ప్రొడక్ట్స్ వల్ల చర్మం కమిలి ఎర్రగా అవుతుంది. అందుకే ప్రొడక్ట్ ని కొనేముందు స్కిన్ని బట్టి పీహెచ్ బ్యాలెన్స్ చేసేవి ఎంచుకోవాలి.
  • సెల్ఫోన్ చేతిలో లేకపోతే ఒక నిమిషం కూడా గడవదు. కానీ, దానివల్ల పెద్ద మొత్తంలో జెమ్స్ ముఖంపైకి చేరతాయి. దానివల్ల యాక్నె, రాషెస్ లాంటి సమస్యలు వస్తాయి. అందుకని ఫోన్ని తక్కువ వాడాలి. దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.