ఫిబ్రవరి 10 నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్

ఫిబ్రవరి 10 నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్

(వెలుగు స్పోర్ట్స్​ డెస్క్)​:మూడుసార్లు సెమీస్ (2009, 2010, 2018),  మూడుసార్లు తొలి రౌండ్ (2012, 2014, 2016)​.. ఒకసారి రన్నరప్ (2020)! టీ20 వరల్డ్​కప్​లో ఇండియా విమెన్స్​ టీమ్​ ప్రస్థానం ఇది. ఇప్పుడు ఎనిమిదో ఎడిషన్​ కోసం మన టీమ్​ రెడీ అయింది. సౌతాఫ్రికా వేదికగా ఈ నెల 10న మెగా టోర్నీ షురూ అవనుంది. మరి, తమకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్​ కప్​ను  టీమిండియా ఈసారైనా ముద్దాడుతుందా? లేక పాత కథనే రిపీట్​ చేస్తుందా?  అన్నది చూడాలి. 

షెఫాలీ, రిచా రాకతో..

యంగ్​స్టర్స్​ అండర్​–19 టీ20 వరల్డ్​ కప్​​ నెగ్గడంతో ఇప్పుడు విమెన్స్​ టీమ్​లోనూ జోష్​ పెరిగింది. ఆ టీమ్​లో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ, రిచా ఘోష్​ రాకతో కాన్ఫిడెన్స్​ రెట్టింపైంది. ఈ ఇద్దరికి తోడుగా స్మృతి మంధాన ఈ టోర్నీలో అత్యంత కీలకం కానుంది. తన పవర్​ హిట్టింగ్​తో ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టిస్తున్న స్మృతి ఈ టోర్నీలో రాణించాలని పట్టుదలగా ఉంది. దీంతో పాటు వైస్​ కెప్టెన్​గా కూడా తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపెట్టాలని కోరుకుంటోంది. ఓపెనింగ్​లో షెఫాలీ, స్మృతి ఇచ్చే ఆరంభంపైనే టీమిండియా విజయాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మిడిలార్డర్​లో కెప్టెన్​ హర్మన్​ప్రీత్​, జెమీమా, హర్లీన్​, దీప్తి శర్మ తోడైతే ఇండియాకు తిరుగులేదు. బౌలింగ్​లోనూ ఇండియా పేస్​–స్పిన్​ కాంబినేషన్​ బలంగానే కనిపిస్తున్నది. కాకపోతే ఫీల్డింగ్​లో హర్మన్​సేన చాలా మెరుగవ్వాల్సి ఉంది. 

ఆ మూడింటితోనే  ముప్పు

ఈ టోర్నీలో గ్రూప్​–బిలో ఇండియాతో పాటు ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్​ ఉన్నాయి. లీగ్​ దశలో ముందంజ వేయాలంటే టీమిండియా.. బలమైన ఇంగ్లండ్​కు చెక్​ పెట్టాలి. పాక్​, విండీస్​ నుంచి కూడా పోటీ ఉంటుంది. కాకపోతే ఇంగ్లండ్​ను జయిస్తే డైరెక్ట్​గా సెమీస్​ బెర్త్​ను ఖాయం చేసుకోవచ్చు. అయితే నాకౌట్​ దశలో మాత్రం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఐదుసార్లు కప్​ నెగ్గిన కంగారూలు ఆరోసారి టైటిల్​పై గురి పెట్టారు. రెండుసార్లు రన్నరప్​ న్యూజిలాండ్​ కూడా రేస్​లో కనిపిస్తున్నది. ఇక సౌతాఫ్రికాకు హోమ్​ అడ్వాంటేజ్​ ఉండనుంది. ఇటీవల ముగిసిన ట్రై సిరీస్​ ఫైనల్లో ఆ జట్టు చేతిలో   ఇండియా ఓడింది.  ఇక, ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఆసీస్​ చేతిలో చిత్తయింది. ఓవరాల్​గా బలమైన జట్టుతో బరిలోకి దిగుతున్న హర్మన్​సేన.. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆడితే ఈసారి కూడా ఫైనల్లో చూడొచ్చు.