
ఖమ్మం DRDA కార్యాలయంలో దొంగచాటుగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. కొంతమంది దుండగులు అనధికారికంగా అధికారుల అండదండలతో వృక్ష సంపదను తరలిస్తున్నారు. ఈ రోజు ( సెప్టెంబర్ 15) ఆదివారం సెలవు కావడంతో .. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చెట్లను కొట్టిస్తూ తరలింపునకు సహకరిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నేల కూలిన చెట్ల మాటున మహా వృక్షాలను నరికి తరలిస్తున్నారు. అయితే ఈ ఘటనను వీడియో తీస్తున్న పాత్రికేయులను సైదులు అనే అటెండర్ మద్యం మత్తులో బెదిరించాడు.