వర్క్ ఫ్రం హోమా? అయితే ఇట్ల చేద్దాం

V6 Velugu Posted on May 13, 2021

వర్క్​ ఫ్రం హోం  చేస్తున్న వాళ్లు రిలాక్స్డ్‌‌గా​గా ఉండాలంటే మీ చుట్టు పక్కల కూడా ప్రశాంతంగా ఉండాలి అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.  అందుకు బ్రైట్ కలర్స్​ఉన్న గదిలో కూర్చోవాలి. ఈ రంగులు బద్ధకాన్ని దూరం చేయడానికి,  మైండ్​ను  రిలాక్స్​గా ఉంచడానికి  ఉపయోగపడతాయి. ఇంట్లో కనిపించే రంగుల ద్వారా ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.   శరీరం, మనసు రెండింటి మీదా రంగుల ప్రభావం ఉంటుంది.  అలాగే రూమ్​లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.   మంచి టేబుల్​, ఆఫీసు కుర్చీ, డెస్క్‌‌‌‌  అరేంజ్​ చేసుకోవాలి.  టేబుల్​ పైన డెస్క్ క్యాలెండర్, గడియారం,  స్టేషనరీలను పెట్టుకోవాలి. ఇవి ఆహ్లాదంగా, అందంగా కనిపించి మూడ్​ను ఫ్రెష్​గా ఉంచుతాయి.  టేబుల్​పై నేరుగా  సన్​లైట్​ పడకుండా, రిఫ్లెక్షన్​ లైట్​ పడేలా ఉండాలి. వేడి పుట్టించే లైట్లు వద్దు.  పని చేయడానికి ఆఫీస్​ ఎంత క్రియేటివ్​గా ఉంటుందో ఆలోచించి, ఇంటి దగ్గర కూడా వీలైనన్ని అరేంజ్​మెంట్స్​ చేసుకోవాలి.  మనసు బాగుంటేనే కదా!  పని మీద ఫోకస్​ ఉండేది.

Tagged lockdown, coronavirus, work from home, MIND RELAX, office atmosphere

Latest Videos

Subscribe Now

More News