
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఇంట్లో ఉంటే ఏవో చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. ఓట్స్, నట్స్, వేగించిన బఠాణీలు తీసుకోవాలి. బఠాణీల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అందువల్ల వేగించిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మధ్య మధ్యలో వీటిని తింటే రిలాక్స్ అవడమే కాకుండా.. ఆకలి కూడాతీర్చుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఆకలి తీర్చే మరో హెల్దీ ఫుడ్ పప్పులు, అంటే డ్రైనట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, పల్లీలు వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి కూడా ఖర్జూరాలు, కిస్మిస్, రెండు, మూడు జీడిపప్పు పలుకులు, వాల్ నట్స్, ఫిగ్స్ వంటివి మధ్య మధ్యలో తింటే ఆకలికి చెక్ పెట్టినట్లవుతుంది.
ఇవి బాడీలో చెడు కొవ్వును కూడా తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్లు కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పని చేసిచేసీ అలసటగా ఫీలైతే... ఓ డార్క్ చాక్లెట్ తింటే చాలు. వెంటనే మూడ్ మారుతుంది. ఎనర్జీ పెరగాలంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాలి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.