మళ్లా ఇంట్లకెంచే పని!

మళ్లా ఇంట్లకెంచే పని!

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: కార్పొరేట్ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ బాట పట్టాయి. ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుద్దామని ప్లాన్స్‌ వేసుకున్న కంపెనీలు కూడా  ఒమిక్రాన్ దెబ్బకు తమ ప్లాన్స్‌‌ను వాయిదా వేస్తున్నాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌‌ను కచ్చితంగా అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు 9.5 లక్షలకు చేరుకున్నాయి. కొత్త వేరియంట్‌‌ వేగంగా విస్తరిస్తోంది.  దీంతో   కార్పొరేట్ కంపెనీలు 30 శాతం స్టాఫ్‌‌తోనే ఆఫీస్‌‌లను నడిపిస్తున్నాయి. వివిధ సెక్టార్లకు చెందిన 20 కంపెనీలతో ఈటీ మాట్లాడింది. ఈ కంపెనీలన్నీ కేసులు తగ్గాక  ఎంప్లాయిస్‌‌ను తిరిగి ఆఫీస్‌‌లకు పిలవడంపై ఆలోచిస్తామని చెప్పాయని పేర్కొంది.  మారికో, పానాసోనిక్‌‌, శామ్‌‌సంగ్‌‌, మెర్సిడెజ్‌‌ బెంజ్‌‌ ఇండియా, మోతిలాల్‌‌ ఓస్వాల్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌  వంటి కొన్ని కంపెనీలు 30¯50 శాతం మంది ఉద్యోగులను ఆఫీస్‌‌లకు రమ్మంటున్నాయి. మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇన్‌‌మొబి గ్రూప్‌‌, కేపీఎంజీ, డెలాయిట్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌, మీషో, క్యాష్‌‌కరో కంపెనీలు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ మోడ్‌‌లో ఉన్నాయి. కరోనా కేసులు తగ్గాక తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని చెబుతున్నాయి. టాటా స్టీల్‌‌, ఐబీఎం, సిస్కో, జీఈ, బైజూస్‌‌ కంపెనీలు కూడా వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ చేసేందుకు  మెజార్టీ ఉద్యోగులకు అవకాశం ఇచ్చాయి.

ప్లాన్స్ అన్నీ వాయిదా..

కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రైవేట్ ఆఫీసులు క్లోజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు తమ ఢిల్లీ ఆఫీస్‌‌లను క్లోజ్ చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండడంతో గ్లోబల్‌‌గా ఉన్న తమ మొత్తం ఆఫీస్‌‌లను ఇంకో నాలుగు వారాల పాటు క్లోజ్ చేస్తున్నామని విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే ప్రకటించారు.  ‘ హైబ్రిడ్ వర్క్ మోడ్‌‌లో ఉద్యోగులను ఆఫీస్‌‌లకు తీసుకొద్దామని అనుకున్నాం. కానీ, ప్రస్తుతం కేసులు పెరుగుతుండడతో ఆఫీస్‌‌లు తిరిగి ఓపెన్ చేయడాన్ని హోల్డ్‌‌లో పెట్టాం.  కేసులు మరింత పెరగకుండా ఉండేందుకు దేశంలోని తమ ఆఫీస్‌‌లను క్లోజ్‌‌ చేస్తున్నాం.  తదుపరి నోటీస్‌‌ ఇచ్చేంత వరకు ఇవి క్లోజ్‌‌లో ఉంటాయి. ప్రభుత్వ రిస్ట్రిక్షన్లను, పరిస్థితులను గమనిస్తున్నాం’ అని ఇన్‌‌మొబి గ్రూప్‌‌ చీఫ్ హెచ్‌‌ఆర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ సాహిల్‌‌ మథుర్‌‌‌‌ అన్నారు. ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌‌లకు రప్పించాలని అనుకున్న కేపీఎంజీ, డెలాయిట్‌‌ వంటి కన్సల్టింగ్ కంపెనీలు  కూడా తమ ప్లాన్స్‌‌ను వాయిదా వేసుకుంటున్నాయి. కేపీఎంజీ ఆఫీస్‌‌లు జనవరి 21 వరకు క్లోజ్‌‌గా ఉంటాయి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ‘రెండు నెలల తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాం’ అని డెలాయిట్ చీఫ్‌‌ ట్యాలెంట్ ఆఫీసర్‌‌‌‌ ఎస్‌‌వీ నాథన్ అన్నారు.  ఉద్యోగులు ఆఫీస్‌‌లకు రావాలనుకుంటే రావొచ్చని  కిందటి నెల ప్రకటించిన ఫ్లిప్‌‌కార్ట్‌‌, ప్రస్తుతం తన ప్లాన్స్‌‌ను మార్చింది.  ఈ నెల 31 వరకు ఉద్యోగులు ఆఫీసులకు రావొద్దని సలహాయిచ్చింది. డాబర్ కూడా ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌, ఘజియాబాద్‌‌లలోని తమ స్టాఫ్‌‌కు రెండు వారాల పాటు వర్క్‌‌ ఫ్రమ్ హోమ్‌‌ చేయడానికి అనుమతిచ్చింది. ఈ నెల నుంచి  ఉద్యోగులను ఆఫీస్‌‌లకు పిలవాలని చూసిన క్యాష్‌‌ఫ్రీ, ప్రస్తుతం వాలంటరీ వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను ఆఫర్ చేస్తోంది. 

ఈ కంపెనీలు కూడా..

కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను కార్పొరేట్ కంపెనీలు ఫాలో అవుతున్నాయి.  కోవిడ్ ప్రోటోకాల్స్‌‌ను పాటిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను తిరిగి ఆఫర్ చేస్తున్నామని మారికో ప్రకటించింది.  ఉద్యోగులు కరోనా నియమాలను పాటించాలని టాటా స్టీల్ సూచించింది. వీలుంటే వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను ఎంచుకోండని చెబుతోంది. ఆర్‌‌‌‌పీజీ గ్రూప్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను ఆఫర్ చేయగా, ఉద్యోగులందరు తప్పకుండా వర్క్ ఫ్రమ్ హోమ్  చేయాలని మిషో ఆదేశించింది. ఐటీసీ కేవలం 30 శాతం స్టాఫ్‌‌నే ఆఫీస్‌‌లకు రమ్మంటోంది. పానాసోనిక్‌‌ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఆఫీసులకు వస్తుండగా, శామ్‌‌సంగ్‌‌ 30 శాతం మందితో ఆఫీస్‌‌లను నడుపుతోంది. మిగిలిన  కంపెనీలూ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. 

ఇకపోతే, టాప్ ఐటీ కంపెనీలయిన టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, విప్రోలలో ఉద్యోగులు జాబ్‌‌ మానేయడం డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో పెరిగింది. ఇన్ఫోసిస్‌‌లో అట్రిషన్ (వాలంటరీగా జాబ్ మానేయడం) రేటు క్యూ3 లో 25.5 శాతానికి పెరిగింది. విప్రోలో అట్రిషన్ రేటు 22.7 శాతంగా ఉంది. టీసీఎస్‌‌లో 15.3 శాతంగా నమోదయ్యింది. కాగా, ఈ మూడు కంపెనీలు వెళ్లిపోతున్న వారిని భర్తీ చేయడానికి భారీగా నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్‌‌ కిందటేడాది ఏప్రిల్‌‌–సెప్టెంబర్ మధ్య 43 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఒక్క డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లోనే 34 వేల మందికి ఉద్యోగాలిచ్చింది. విప్రో డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో 10,306 మందిని నియమించుకుంది. ఇన్ఫోసిస్‌‌ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో 15,125 మందిని నియమించుకుంది.