వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలె : రాజర్షి షా

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలె : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్​రాజర్షి షా టీచర్లకు సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆఫీసులో అధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ..  మార్చిలో జరిగే పదో తరగతి  పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు  సబ్జెక్ట్ టీచర్లు  అందరూ కృషి చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా డీఈవో రాధాకిషన్ జిల్లావ్యాప్తంగా పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో   మండల ప్రత్యేకాధికారులు విజయలక్ష్మి, శంకర్ నాయక్​, మైనారిటీ సంక్షేమ అధికారి జెమ్లానాయక్​, రవి ప్రసాద్,  గోవింద్,  కృష్ణయ్య, సుదర్శన మూర్తి పాల్గొన్నారు. 

12న సింగూరు నీటి విడుదుల  

యాసంగి పంటల అవసరాలకు సింగూరు నుంచి ఈనెల 12న నీరు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. కలెక్టర్​ ఆఫీసులో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి విడుదలతో  మెదక్, హవేళీ ఘనపూర్, కొల్చారం , పాపన్నపేట మండలాల్లోని 21,625 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో ఎస్ఈ యేసయ్య, ఈఈ  శ్రీనివాస్ రావు,  డీఈలు, ఏఈలు, నీటి పారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

31 వరకు ధాన్యం మిల్లింగ్​ చేయాలి 

మెదక్​ జిల్లాలోని అన్ని రైస్​మిల్లర్ల వద్ద ఉన్న  ధాన్యాన్ని ఈ నెల 31వరకు బియ్యంగా మార్చాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. కలెక్టర్​ ఆఫీసులో జిల్లాలోని  రైస్ మిల్లర్లతో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రోజూ వారి లక్ష్యాన్ని ఏర్పరచుకొని పనిచేయాలన్నారు. లక్ష్యం చేరుకోకపోతే  వచ్చే సంవత్సర కేటాయింపు తగ్గుతుందని, వారిని  బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీసీఎస్​వో బ్రహ్మారావు, సివిల్​ సప్లయి డీఎమ్​ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.