శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంకు పరిశీలన ముగిసింది... ఈ క్రమంలో డ్యామ్ మరమ్మతుల కోసం 103 కోట్లకు ఆమోదం తెలిపారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. నవంబర్ లో డ్యామ్ మరమ్మత్తులకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు అధికారులు. డ్యాం ముందు భాగం లో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి 10 కోట్లు విడుదల చేసేందుకు, జలాశయం అప్రోచ్ రోడ్డు,కొండ చరియల మరమ్మత్తులకు ప్రపంచ బ్యాంకు అంగీకారం తెలిపింది.
2011 నుండి 2024 వరకు పూడిక ద్వారా జలాశయం 9 టీఎంసీలు నీరు తగ్గిందని.. ఏపీలో నూతన ప్రభుత్వం హయంలో 103 కోట్ల ఆమోదం తెలపడం ఆనందకరమని డ్యామ్ అధికారులు అన్నారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ ప్రస్తుతం సుమారు 46 మీటర్ల లోతు ఉందని తెలిపారు అధికారులు.