
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నీతూ ఘంఘూస్ నిలిచింది. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణం పతకం గెలిచింది. మార్చి 25వ తేదీ శనివారం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ నుంచి 48, 50 కేజీల విభాగాల్లో ఫైనల్ కు చేరారు.
ఫైనల్ మ్యాచ్ లో నీతూ మొదటినుంచి ప్రత్యర్థిపై పంచులతో విరుచుక పడి పూర్తి ఆధిపత్యం సాధించింది. నీతూ గోల్డ్ మెడల్ సాధించటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. నీతూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్‌గా నిలిచింది.