నేటి నుంచి ఢిల్లీలో వరల్డ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌

నేటి నుంచి ఢిల్లీలో వరల్డ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌
  • నిఖత్‌‌‌‌ జరీన్​, లవ్లీనాపై భారీ అంచనాలు
  • 65 దేశాల నుంచి 300 పైచిలుకు బాక్సర్లు బరిలోకి

న్యూఢిల్లీ: తన పంచ్‌‌‌‌ పవర్‌‌‌‌తో గతేడాది వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ, ఇండియా స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకునేందుకు రెడీ అయింది. పోయినేడాది ఇస్తాంబుల్‌‌‌‌లో ఇరగదీసిన నిఖత్‌‌‌‌ ఈసారి ఇండియాలో గోల్డెన్‌‌‌‌ పంచ్‌‌‌‌ విసరాలని ఆశిస్తోంది.  ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌లో బుధవారం మొదలయ్యే వరల్డ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా నుంచి నిఖత్‌‌‌‌  (50 కేజీ) ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది.  12 మందితో కూడిన హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో నిఖత్‌‌‌‌ తోపాటు ఒలింపిక్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ లవ్లీనా బొర్గొహైన్‌‌‌‌ (75 కేజీ) పై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 26 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 వెయిట్‌‌‌‌ కేటగిరీల్లో 65 దేశాల నుంచి 300 పైచిలుకు బాక్సర్లు  పోటీ పడనున్నారు.

తొలి రోజు ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీ, వేయిన్‌‌‌‌ జరగనుంది. విన్నర్లకు గతంలో కంటే అత్యధికంగా మొత్తం రూ. 20 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందిస్తున్నారు. ఈ మెగా టోర్నీ  2024 పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు మెయిన్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌గా ఉంటుందని ఇంటర్నేషనల్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఐబీఏ) ప్రకటించింది. కానీ, ఆ ప్రకటనను ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ (ఐవోసీ) ఖండించింది. పైగా, ఐబీఏపై గతేడాది బ్యాన్‌‌‌‌ విధించింది. దాంతో, అనేక సందేహాల మధ్యనే ఈ టోర్నీ జరగనుంది.