ODI World Cup 2023: మీలాంటి వాళ్లు భారతదేశానికి అవసరం లేదు.. పాకిస్తాన్‌ వచ్చేయండి: పాక్ క్రికెటర్

ODI World Cup 2023: మీలాంటి వాళ్లు భారతదేశానికి అవసరం లేదు.. పాకిస్తాన్‌ వచ్చేయండి: పాక్ క్రికెటర్

స్వేచ్ఛా ప్రపంచం మన దేశం.. ఎవరు ఏదైనా చేయొచ్చు.. ఏదైనా మాట్లాడుకోవచ్చు.. ఆడిగితే హక్కు అంటారు.. అంతెందుకు ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనకు నచ్చినరీతిలో రాస్తున్నామంటే.. అదీ స్చేచ్చే. ఇలానే స్వదేశంలో ప్రపంచ కప్ మ్యాచ్‌లకు హాజరవుతున్న అభిమానులు తమకు నచ్చిన జట్టుకు మద్దతిస్తున్నారు.. తమకు నచ్చిన నినాదాలు చేస్తున్నారు. కానీ ఈ సంఘటనలు కొందరు భారత పౌరులకు నచ్చట్లేదు. 

కొన్ని గంటల క్రితం భారత మహిళా జర్నలిస్ట్ అర్ఫా ఖనుమ్ షెర్వాణీ.. భారత క్రికెట్ అభిమానుల ప్రవర్తనను తప్పుబడుతూ ట్వీట్ చేసింది. ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరవుతున్న భారత అభిమానులు హద్దులు ధాటి ప్రవర్తిస్తున్నా ఆమె.. వారి ప్రవర్తనతో భారతీయురాలని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ ఘటనలకు మోదీ-ఆర్‌ఎస్‌ఎస్ విధానమే కారణమని ఆరోపించింది. ఒకవైపు ఆమె వ్యాఖ్యల పట్ల స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతుంటే.. పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా మరింత ఘాటుగా స్పందించారు.

ఖనుమ్ షెర్వాణీ లాంటి వాళ్లు భారతదేశానికి అవసరం లేదన్న కనేరియా.. ఆమెను పాకిస్తాన్‌కు వలస వచ్చేయమని సూచించాడు."భారతీయురాలిగా చెప్పుకునేందుకు సిగ్గుపడితే మా దేశం పాకిస్తాన్‌కు వచ్చేయండి. మీలాంటి వ్యక్తులు భారతదేశానికి అవసరం లేదు. ప్రపంచ కప్‌ మ్యాచ్ లనును భారత్‌లో చాలా మంది ప్రజలు సంతోషంగా ఆస్వాదిస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను.." 'అని కనేరియా ట్వీట్ చేశాడు.

కాగా, కనేరియాకు భారత అభిమానులు మద్దతు తెలుపడంపై అతని పట్ల నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడిన రెండో హిందువు డానిష్ కనేరియా.