
జగిత్యాల టౌన్/రాయికల్/మెట్‌పల్లి/కోరుట్ల/చొప్పదండి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జగిత్యాల, రాయికల్‌లో ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. చొప్పదండిలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు.