క‌రోనా వారియ‌ర్స్ : వ‌ర‌ల్డ్ హెల్త్ డే స్పెష‌ల్

క‌రోనా వారియ‌ర్స్ : వ‌ర‌ల్డ్ హెల్త్ డే స్పెష‌ల్

గడపదాటాలంటే భయం. మనిషి దగ్గరికి వస్తుండంటే భయం. ఒకరికి ఒకరు..దూరందూరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా గుండెల్లో దడ పుడుతోంది. కరోనా అందరి గుండెల్లో నిద్రపోతోంది. ఆ కరోనా గుండెల్లో నిద్రపోయే వారియర్స్.. డాక్టర్లు, నర్సులు. కరోనా సోకిన వాళ్లందరినీ ఐసోలేషన్కిచేర్చి దాని అంతు చూస్తున్న ఈవారియర్స్​ కునుకు తీయడానికికూడా టైమ్లేదు. వేలల్లో సస్పెక్టెడ్ కేసులు.

వందల్లో కరోనా పాజిటివ్​ కేసులు. క్వారంటైన్లో ఉన్న వాళ్లకు కౌన్సెలింగ్, కరోనా సోకిన వాళ్ల ట్రీట్మెంట్ఇవ్వడంలో ఆకలి, నిద్రమరిచిపోయారు. అందరి ఆరోగ్యం కోసం పనిచేయడమే వృత్తి ధర్మంగా ఎంచుకున్న మెడికల్ స్టాఫ్ ప్రపంచ ఆరోగ్యం కోసం పోరాటం చేస్తోంది. మనమంతా హెల్దీగా ఉండాలని కోరుకుంటే.. వీళ్లంతా హెల్దీగా ఉండాలని మనమంతా కోరుకుందాం. వరల్డ్ హెల్త్​ డే సందర్భంగా రాష్ట్రంలోని కరోనా ఐసోలేషన్​ వార్డుల్లో పనిచేస్తున్న నర్స్ ల‌పై స్పెషల్​ స్టోరీ.

కనిపించని శత్రువు కరోనాతో కాలం యుద్ధం చేస్తోంది. ఈ ప్రపంచ యుద్ధంలో మనిషిని గెలిపించాలని, బతికించాలని మెడికల్ స్టా ఫ్ త్యాగానికి సిద్ధపడ్డ ది. దేశదేశాలు దాటుకుంటూ భూగోళమంతా విస్తరించిన కరోనాకి భయపడకుండా దాని అంతుచూసే యుద్ధకాలంలో డాక్టర్లు , నర్సుల త్యాగాలెన్నో వింటున్నాం. ప్రాణాలను ఫణంగా పెడుతున్న మెడికల్ స్టాఫ్ స్ఫూర్తి కూడా కరోనాతోపాటే విస్తరిస్తోంది. కరోనా ఎక్కడ కాలుపెడితే అక్కడ దాన్ని ఐసోలేట్ చేసి తొక్కిపెట్టేస్తున్నారు. మనిషి మనుగడకే సవాల్ చేస్తున్న కరోనాతో మెడికల్ స్టా ఫ్ ప్రతి సవాల్చే స్తోంది. ‘ఎవరు గెలుస్తారో?’ అని ఎదురుచూస్తున్న మృత్యు ముఖం నుంచి కొంతమంది నెగెటివ్ రిపోర్ట్​తో డిశ్చార్జ్ అవుతున్నారు. ఊపిరి సలపనివ్వని కోవిడ్ 19 భయానికి దేశమంతా తలుపులు మూసేసుకుంది.

లాక్డౌన్లో ఉన్న ప్రపంచం ఊపిరి పీల్చుకునే కరోనా నెగెటివ్ వార్తలు వినిపిస్తున్నాయ్. మరణానికి భయపడకుండా.. తిండి తినకుండా, నిద్రపోకుండా, అయినవాళ్లకు దూరమై కరోనా బాధితులకు అండగా నిలిచిన నర్స్​లు వైరస్తో యుద్ధం చేస్తున్నారు. వీళ్లే మన సైన్యం. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం పోరాడుతున్న కరోనా వారియర్స్​కి ‘వరల్డ్​ హెల్త్​ డే’ శుభాకాంక్షలు.

ఈ యుద్ధ కాలపు అనుభవాలు వింటూ, వాళ్ల పోరాటానికి సంఘీభావం చెబుదాం. కరోనా యుద్ధంలో మన సిస్టర్స్​ సంకల్పాన్ని, ధైర్యాన్ని, ఆశనిరాశలు విందాం. వాళ్లకు కావాల్సిందేమిటో? మనం చేయకూడనిదేమిటో ఆలకిద్దాం. కరోనాని జయిద్దాo.

ఫోన్​లోనే పలకరింపులు

జనగామ జిల్లా, ఘన్పూర్ మండలంలో శివునిపల్లి గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్న. విదేశాలు, ఇతర రాష్ర్టాల్లో ఉండే ఈ ఊరి వాళ్లు కరోనా భయంతో తిరిగొచ్చారు. వాళ్ల‌ను హోమ్ క్వారంటైన్లో ఉంచాము. వాళకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కరోనా గురించి ఇల్లిల్లు తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. క్వారంటైన్ లో ఉన్నవాళ్ల‌ను ఉదయం, సాయంత్రం పలకరించి, ‘హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా
ఉన్నాయా?’ అని అడిగి, జాగ్రత్తలు పాటిస్తున్నదీ లేనిదీ కనుక్కొని రెగ్యులర్గా పై ఆఫీసరకు రిపోర్ట్  చేస్తున్నాం. జనతా కర్ఫ్యూ రోజు కూడా అదే పనిలో ఉన్నాను. ఆ రోజు రాత్రి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.

మేము ఘన్పూర్లో ఉంటున్నాం. ఇంటికి పోవాలంటే వెహికిల్ లేదు. ఎలాగోలా పోవచ్చు. కానీ, ఊళ్లో క్వారంటైన్లో ఉన్న వాళని వదిలేసి ఇంటిదగ ద‌గ్గ‌ర‌ ఉండలేము. ఇలాంటి కష్టం నా సర్వీస్లో ఎన్నడూ రాలే. ఆ జనతా కర్ఫ్యూ రోజు రాత్రే ఊళ్లో ఓ గది అద్దెకు తీసుకున్న. కట్టుబట్టలతో వచ్చి.. తరువాత అన్నీ సమకూర్చుకున్న. ఊళ్లో టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ల‌ని గ్యాస్, రెండు ప్లేట్లు అడిగి తెచ్చుకున్న. బట్టల షాప్ వాళ ఇంటికిపోయి దుప్ప‌ట్లు, కండువా, రెండు నైటీలు కొన్న. మూడు వారాల నుంచి ఈ ఊళ్లోనే ఉంటున్న. నేనెట్లున్ననో అని పిల్లలు బాధపడుతున్నరు. రోజూ వీడియో కాల్ లో ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం.

 – పెరుమాళ్ల కవిత, కమ్యూనిటీహెల్త్ ​ఆఫీసర్​, జనగామ జిల్లా

నా పేరుని సార్థకం చేసుకుంటున్న

కరోనా వార్తలు వింటున్నప్పుడు నేను గాంధీ హాస్పిటల్లో నైట్ సూపర్వైజర్ డ్యూటీలో ఉన్నాను. నైట్ షిప్ట్​లో అటెండెన్స్ తీసుకోవడం నా డ్యూటీ. కరోనా పేషెంట్స్ కోసం వార్డ్​స్టార్ట్ చేసినట్లు ​ కొన్ని రోజులకే నన్ను అక్కడికి పొమ్మన్నారు. రోజూ ఎలా డ్యూటీ చేస్తానో అలాగే ఆ వార్డుకీ పోయాను. భయపడలేదు. మా ఆయన టీవీల్లో హడావిడి చూసి ‘ఉద్యోగం లేకుంటే మాయెలె. మానేయ్’ అన్నడు. ఏమీ కాదని చెప్పిన.
పాతికేళ్ల నుంచి నర్స్ గా డ్యూటీ చేస్తున్న. ఎప్పుడూ భయపడలేదు. నేనే కాదు మిగతా నర్సులు కూడా రోజుటిలాగే ఉన్నారు. కరోనా వార్డుకి పోమని ఎవరూ అనడంలేదు. రోగికి సేవ చేయడం నర్స్ డ్యూటీ. వాళ్లు ఏ స్థితిలో ఉన్నా ట్రీట్మెంట్ చేయాలి. అలా చేస్తామనే కదా ఉద్యోగంలో చేరాం. మన ప్రాణాల మీదకు వస్తుందని వదిలేయడం వృత్తి ధర్మం కాదు. ఈ వృత్తే మాలో ఈ ధైర్యాన్ని నింపింది. డాక్ట‌ర్స్, పేషెంట్ కి ఎలా కౌన్సెలింగ్ ఇస్తారో…అలానే మాకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కరోనా రాకుండా ఎలా జాగ్రత్తపడాలి.

కరోనా పేషెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల‌తో ఎలాంటి డిస్టెన్స్ మేనేజ్ చేయాలో ముందే చెప్పారు. ఆ అవగానతో పాటు కరోనా సోకకుండా పీపీటీ ఎక్విప్ మెంట్స్ ధరించాను. డిస్టెన్స్ పాటించడం ఒక్కటే కరోనా నేర్పింది. శుభ్రత, మాస్కులు, గ్లౌజులు మాకు అలవాటే. ఐసోలేషన్లో ఉంటే ఏమీ కాదు. ఎప్పుడూ మాస్క్​ ఉండాలి. టైమ్ కి తినండి. మందులు వేసుకోండి తగ్గిపోతుందని పేషెంట్స్ కి ధైర్యం చెప్పాం. కరోనా పేషెంట్స్ ఒంటరిగా బాధపడకుండా ఉండాలని మాలో ఎవరో ఒకరు అప్పుడప్పుడూ పలకరిస్తాం. ‘తిన్నారా? మందులు వేసుకున్నారా? ఇప్పుడెలా ఉందని మాట్లాడిస్తాం. ఏమన్నా కావాలా? అని అడిగితే .. కొందరు డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్కావాలంటారు.’ కట్టు బట్టలతో వచ్చిన పేషెంట్స్ కి పేస్ట్​, బ్రష్, సోప్స్ తెప్పించాం. వాళ్ల‌కు ఇష్ట‌మైన‌ది తింటామంటే కూడా తెప్పిస్తున్నాం. మా మేనత్త నాకు నైటింగేల్ అని పేరు పెట్టింది. ఆపేరుని సార్ద‌కం చేసుకుంటున్నా.-
-–డి. ఫ్లోరెన్స్​నైటింగేల్​, హెడ్​నర్స్​ గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్.

మ‌రికొంత మంది న‌ర్సుల అభిప్రాయాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి