
ప్రపంచంలో మనుషుల ఆయుష్షు 20 నెలలు తగ్గిపోయిం ది. ఇందుకు కారణం గాలి కాలుష్యమే నంటూ అమెరికాకు చెం దిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూ ట్ (హెచ్ఈఐ) బాంబు పేల్చింది.2017లో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ఎక్కువ కాలం పాటు కలుషిత గాలి పీల్చి చనిపోయారని చెప్పింది. వీళ్లలో 24 లక్షల మంది బాధితులు ఇండియా, చైనాకు చెం దినవారనే చేదు నిజాన్ని ది స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్టు–2019’లో బయటపెట్టింది. మొత్తంగా 2017లో గాలి కాలుష్యం వల్ల చనిపోయిన వాళ్ల లెక్కలుఇలా ఉన్నాయి.
ఇండియా(12 లక్షల మంది),చైనా(12 లక్షల మంది), పాకిస్థా న్(1.28 లక్షలమంది), ఇండోనేసియా(1.24 లక్షల మంది), బంగ్లాదేశ్(1.23 లక్షల మంది), నైజీరియా(1.14లక్షల మంది), అమెరికా(1.08 లక్షల మంది),రష్యా(99 వేల మంది), బ్రెజిల్(66 వేల మంది),ఫిలిప్పీ న్స్(64 వేల మంది) ఎయిర్ పొల్యూషన్ వల్ల మరణించారు. ప్రపంచవ్యాప్తంగా స్మో కింగ్,పోషకాహార లోపం, మద్యం తాగడం, ఎక్సర్ సైజ్ లేకపోవడం తదితర రిస్క్‌ల కంటే ఎయిర్ పొల్యూషన్ రిస్కే ఎక్కువగా ఉన్నట్లు హెచ్ఈఐ పేర్కొంది. మలేరియా, రోడ్డు ప్రమాదాల కంటేగాలి కాలుష్యం వల్ల వచ్చి న జబ్బుల వల్లే ఏటాఎక్కువ మంది చనిపోతున్నట్లు చెప్పిం ది. ఇంటా,బయటా గాలి కాలుష్యం ప్రపంచ జనాభాను వేధిస్తోందని తెలిపింది. ఎయిర్ పొల్యూషన్‌పై చైనాచూపుతున్న శ్రద్ధతో పార్టిక్ యులేట్ మేటర్ 2.5 కంటే తగ్గుముఖం పడుతున్నట్లు చెప్పిం ది.
ఆకలితో అల్లా డిన 11.3 కోట్ల మంది
కల్లోలం, వాతావరణం, ఆర్థిక సమస్యలు మూడూ ఆయుధాలై 53 దేశాల కడుపు మాడ్చాయి. గతేడాది ఈ దేశాల్లోని 11.3 కోట్ల మంది సరైన తిండి లేక అల్లాడిపోయారని ఐక్యరాజ్యసమితి,యూరోపియన్ యూనియన్ సంయుక్త నివేదిక‘‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్–2019’’లో వెల్లడిం చాయి. ముఖ్యంగా యెమెన్, కాంగో ,ఆఫ్గానిస్థా న్, ఇథియోపియా, సిరియా, సూడాన్,సౌత్ సూడాన్, నార్త్ నైజీరియాల్లో 7.2 కోట్ల మంది ప్రజలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు లేక విలవిల్లాడారని పేర్కొన్నాయి.2018లో వాతావరణ మార్పు లు, సహజ విపత్తుల వల్ల 2.9 కోట్ల మందికి తిం డి లేకుం డాపోయిందని యూఎన్, ఈయూ తెలిపాయి. మరో 42 దేశాల్లోని 14.3 కోట్ల మంది ‘ఆకలి’ ప్రమాదాన్ని ఎదుర్కొ నే స్థితిలో ఉన్నారని చెప్పాయి. 21వ శతాబ్దం చివరి నాటికి ఆకలి బాధల్లేని ప్రపంచాన్ని చూడాలనే లక్ష్యంలో భాగంగా ఈ రిపోర్టును తయారు చేసినట్లు వెల్లడిం చాయి.