బ్లూ బెర్రీ రికార్డ్..దీని బరువు అక్షరాలా...

బ్లూ బెర్రీ రికార్డ్..దీని బరువు అక్షరాలా...

చూడగానే ద్రాక్ష అనుకుంటారు. కానీ ఇది బ్లూ బెర్రీ. సైజ్​ కూడా దాదాపు ద్రాక్ష అంతే ఉంటుంది. అయితే, ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న  బ్లూ బెర్రీ సైజ్​ మాత్రం పెద్దది. అది ఎంత పెద్దది అంటే వరల్డ్ రికార్డ్​ కొల్లగొట్టేంత! దీని బరువు అక్షరాలా 20.40 గ్రాములు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్​లో ఉన్న  కోస్టా గ్రూప్​కి చెందింది. ఈ బ్లూబెర్రీని నవంబర్ 13, 2023లో కోశారు. కానీ, గిన్నిస్ రికార్డ్ వల్ల ఇప్పుడు దానికి గుర్తింపు వచ్చింది. 

ఎటెర్నా వెరైటీకి చెందిన బెర్రీ. వెరైటీ ఇంప్రూవ్​మెంట్​ ప్రోగ్రామ్​లో భాగంగా (వీఐపీ) బ్రాడ్ హాకింగ్​, జెస్సికా, మారీ అనే వాళ్లు ఎటెర్నా జాతి బ్లూబెర్రీలను పండించారు. అంతేకాదు.. ఇంతకు ముందు వెస్టర్న్​ ఆస్ట్రేలియాలో 2020లో కూడా బ్లూ బెర్రీ రికార్డ్​లకి ఎక్కింది. అప్పట్లో అది16.2 గ్రాములు ఉంది. ఆ రికార్డ్​ ఇప్పుడు బ్రేక్​ అయింది. హాకింగ్ మాట్లాడుతూ ‘‘పెద్ద సైజు పండ్లకు పెట్టింది పేరు ఎటెర్నా వెరైటీ. వాటి టెక్చర్ క్రిస్ప్​గా ఉంటుంది. షెల్ఫ్​ లైఫ్​ ఎక్కువ. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది’’ అన్నాడు.