వరల్డ్ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు

వరల్డ్ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు చేయబడింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచం మొత్తం లాక్డౌన్ కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ ట్రయాథ్లాన్ యూనియన్ శుక్రవారం ప్రకటించింది. అల్బెర్టాలోని ఎడ్మొంటన్‌లో ఆగష్టు 17 నుండి ఆగష్టు 23 వరకు జరగాల్పిన 2020 ప్రపంచ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు చేస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది.

‘ప్రపంచ ట్రయాథ్లాన్ ప్రస్తుతం డబ్ల్యుటీఎస్ మరియు ప్రపంచ కప్ నిర్వాహకులతో పాటు నేషనల్ ఫెడరేషన్లు మరియు కొన్నిభాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. వారందరితో చర్చించి, పరిస్థితులన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఈ సంవత్సరం చివరిలో రీ షెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం’అని ట్రయాథ్లాన్ అపెక్స్ బాడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కరోనా వల్ల అన్నీ క్రీడా కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ప్రీమియర్ లీగ్, ఎల్ఎ లిగా వంటి అన్ని టాప్ టోర్నమెంట్లు నిలిపివేయబడ్డాయి. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లన్నీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై ఖచ్చితమైన సమాధానం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన వింబుల్డన్ పోటీలు కూడా రద్దు చేయబడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారిగా వింబుల్డన్ పోటీలు రద్దు చేయబడ్డాయి. COVID-19 మహమ్మారి కారణంగా జూలై 1 వరకు ఇంగ్లాండ్ లో ఎటువంటి ప్రొఫెషనల్ క్రికెట్ పోటీలు జరగవని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

For More News..

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​