ప్రపంచంలోనే మొట్టమొదటి​ కరెంట్​ విమానం ఎగిరింది

ప్రపంచంలోనే మొట్టమొదటి​ కరెంట్​ విమానం ఎగిరింది

ప్రపంచంలో మొట్టమొదటి కరెంట్​ విమానం గాల్లోకి ఎగిరింది. కెనడాలోని వాంకోవర్​లో విమానాన్ని టెస్ట్​ ఫ్లైట్​ చేసి చూసింది దానిని తయారు చేసిన కంపెనీ సియాటిల్​కు మ్యాగ్ని ఎక్స్​. వాంకోవర్​లోని హార్బర్​ ఎయిర్​ అనే సంస్థ కోసం విమానాన్ని తయారు చేసిచ్చింది. ఎమిషన్స్​ లేకుండా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని మ్యాగ్ని ఎక్స్​ సీఈవో రోయి గాంజార్స్కీ చెప్పారు. ఎలక్ట్రిక్​ ఏవియేషన్​ యుగానికి ఇదే ప్రారంభమన్నారు. ఆరుగురు ప్రయాణించే డీహెచ్​సీ 2 డీఈ హావిలాండ్​ బీవర్​ సీప్లేన్​కు ఎలక్ట్రిక్​ మోటార్​ను పెట్టి ఈ కరెంట్​ విమానానికి రూపునిచ్చారు. హార్బర్​ ఎయిర్​ ఓనర్​, సీఈవో గ్రెగ్​ మెక్​డౌగల్​ విమానాన్ని నడిపి టెస్ట్​ చేశారు. వాంకోవర్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుకు సమీపంలోని ఫ్రేజర్​ నదిలో టెస్ట్​ ఫ్లైట్​ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు దానిని పరీక్షించారు. మొత్తం 40 కరెంట్​ విమానాలకు హార్బర్​ ఎయిర్​ ఆర్డరిచ్చింది. అయితే, అవి ప్రయాణికులను తీసుకెళ్లాలంటే మరో రెండేళ్లు కంపెనీ వేచి చూడాల్సిందే.