ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‌ రీ ఓపెన్‌

ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‌ రీ ఓపెన్‌
  • కండిషన్స్‌ అప్లై
  • మూడు గంటలకు మించి నో షాపింగ్‌
  • ఫీవర్‌‌ టెస్ట్‌ కంపల్సరీ

దుబాయ్‌: కరోనా లాక్‌డౌన్‌ వల్ల మూతపడ్డ ప్రపంచంలోనే అతి పెద్ద మాల్‌గా పేరుపొందిన ‘దుబాయ్‌ మాల్‌’ను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్‌కు వచ్చే వారికి కొన్ని కండిషన్స్‌ విధించారు. మాల్‌కు వచ్చే వాళ్లు కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలి. మాల్‌ ఎంట్రన్స్‌లో, పార్కింగ్‌లో ఫీవర్‌‌ చెక్‌ చేయించుకోవాలి. ఒక్కోరు మూడు గంటలకు మించి మాల్‌లో ఉండేందుక వీలు లేదు. మూడేళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వారు, అరవై ఏళ్లు పైబడిన వారికి అనుమతిలేదని నిర్వాహకులు చెప్పారు. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‌లో మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ విధించారు. దీంతో అన్ని మాల్స్‌, సినిమా హాళ్లు మూతపడ్డాయి. దాదాపు నెల రోజుల తర్వాత మాల్‌ తెరుచుకోవడంతో ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’ అని రాసి ఉన్న నల్ల టీషర్ట్‌లు వేసుకున్న మాల్‌ సిబ్బంది ప్రతి ఒక్కరికి టెంపరేచర్‌‌ చెక్‌ చేస్తూ, వెల్‌కమ్‌ చెప్పారు. “ సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. మాల్‌లో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ప్రతి గంటకు మానిటర్‌‌ చేసేందుకు కూడా అడి ఉపయోగపడుతుంది” అని నిర్వాహకులు చెప్పారు.