ఈ హోటల్లో డిన్నర్ కోసం నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలి

ఈ హోటల్లో డిన్నర్ కోసం  నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలి

హాలిడే , వీకెండ్ టైమ్‌‌‌‌లో ఫేమస్ రెస్టారెంట్లలో రిజర్వేషన్ దొరకడం అంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా మహా అయితే కొన్ని రోజుల వరకు మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుందేమో. కానీ, యూకేలోని సెంట్రల్‌‌‌‌ బిస్టాల్‌‌‌‌లోని ది బ్యాంక్ టావెర్న్‌‌‌‌లో  దొరికే సండే లంచ్ కోసం ‌‌‌‌ ఏకంగా నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వస్తోంది .

 బ్యాంక్ టావెర్న్‌‌‌‌ అందించే సండే లంచ్‌‌‌‌ మెనూకి అంత డిమాండ్ ఉందన్న మాట. ఈ మెనూలో భాగంగా పోర్క్ బెల్లీ, రోస్టెడ్‌‌‌‌ ల్యాంబ్ లెగ్‌‌‌‌ వంటివి ఉంటాయి. రెండు కోర్సుల ధర 21.95 పౌండ్లు (రూ.2,300) .