ధర్మశాలలో కుండపోత వర్షం.. ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ డౌటే !

ధర్మశాలలో కుండపోత వర్షం.. ఇండియా-ఆఫ్ఘనిస్తాన్   మ్యాచ్ డౌటే !

ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ ట్రై సీరీస్ లో భాగంగా ఫస్ట్ వండేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో వర్షం కురుస్తుండటంతో.. జూన్ 13న (శనివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

ధర్మశాలలో వర్షం మొదలైంది. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కుండపోత వర్షం ప్రారంభమైంది. పిచ్, గ్రౌండ్ ను కవర్స్ తో కప్పేశారు. టాస్ పడేందుకు చాలా సమయం పట్టేలా ఉందని చెబుతున్నారు. గ్రౌండ్ అంతా చిత్తడి చిత్తడిగా తయారైంది.

ధర్మశాలలో భారీ వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. 96 శాతం వర్షం కురిసేందుకు అవకాశం ఉందని శనివారం ఉదయం పేర్కొంది. చెప్పినట్లుగానే వర్షం ప్రారంభమవటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన ఫ్యాన్స్ లో మొదలైంది. 

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఇండియా టీమ్.. ఇటీవల జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. 2027 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా వన్డే సిరీస్‌లోనూ అదే స్థాయి ప్రదర్శనను కొనసాగించాలని ఆశిస్తోంది. 

గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో, అందరి దృష్టి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపైనే ఉంది.