వేల్పుగొండ గ్రామంలో .. హోరాహోరీగా కుస్తీ పోటీలు

వేల్పుగొండ గ్రామంలో .. హోరాహోరీగా కుస్తీ పోటీలు

టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ తుంబురేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పహిల్వాన్లు పాల్గొన్నారు.

 పోటీలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోటీలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అత్తాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ గెలుపొందడంతో శాలువాతో సన్మానించి ఐదు తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో  నారాయణ దాసు పాల్గొన్నారు.