పేపర్‌‌‌‌పైన రాసేవారిలోనే జ్ఞాపకశక్తి ఎక్కువ

V6 Velugu Posted on Mar 24, 2021

ఇప్పుడంతా స్మార్ట్‌‌ఫోన్ల జమానా. ఒకప్పుడు బడికిపోతే పలకమీద దిద్దించే వాళ్లు. ఇప్పుడంతా డిజిటల్‌‌ క్లాసులు అయిపోయాయి. అయితే, కంప్యూటర్‌‌, స్మార్ట్‌‌ఫోన్‌‌లలో నోట్‌‌ చేసుకున్న దాని కంటే రాస్తేనే బాగా గుర్తుంటాయట. జపాన్‌‌కు చెందిన కునియోషీ సకాయి అనే యూనివర్సిటీకి చెందిన ఒక రీసెర్చ్‌‌ టీమ్‌‌ ఈ విషయాన్ని కనిపెట్టింది.  దాదాపు 48 మంది స్టూడెంట్స్‌‌పై స్టడీ చేసి ఈ విషయం తెలుసుకున్నారు.  ట్యాబ్‌‌, ఫోన్‌‌లో రాసేవారి కంటే, పెన్ను, పేపర్‌‌‌‌పైన రాసేవారిలోనే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉందని ఆ టీమ్‌‌ చెప్తోంది. అంతే కాకుండా ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోగలుగుతున్నారని ఆ రీసెర్చ్‌‌లో తేలింది. “ మనం ఏదైనా రాసినప్పుడు బ్రెయిన్‌‌ అదనంగా వర్క్‌‌ చేస్తుంది. అది తిరిగి గుర్తుతెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. డిజిటల్‌‌ బుక్‌‌లో టెక్స్ట్​పిక్చర్స్‌‌ ఒకే సైజ్‌‌లో ఉంటాయి. ప్రింటెడ్‌‌ టెక్స్ట్​బుక్‌‌లో అలా ఉండదు. కాబట్టి ఒకసారి చూస్తే మైండ్‌‌లో ఫిక్స్‌‌ అయిపోతుంది. కాబట్టి విజువలైజేషన్‌‌ కూడా సులువుగా ఉంటుంది. పుస్తకంలో రాసుకునేటప్పుడు ముఖ్యమైన విషయాలను సర్కిల్‌‌ చేసుకోవడం లాంటివి చేస్తాం. కాబట్టి ఏది ఇంపార్టెంట్‌‌, ఏది కాదు అనే విషయం తెలుస్తుంది. దాంతో కావాల్సిన విషయాలను బాగా గుర్తుపెట్టుకోవచ్చు” అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. 
 

Tagged writing

Latest Videos

Subscribe Now

More News