
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 151/5 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా, మరో 145 పరుగులు మాత్రమే జోడించింది. భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే(89) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆల్‌రౌండర్ శార్దూ ఠాకూర్(51) హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(48) కూడా పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కు 173 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీసుకోగా.. బోలాండ్, స్టార్క్, గ్రీన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.