అమ్మాయి మనసు దోచేసిన గిల్.. గ్రౌండ్‌లోనే మ్యారేజ్ ప్రపోజల్

అమ్మాయి మనసు దోచేసిన గిల్.. గ్రౌండ్‌లోనే మ్యారేజ్ ప్రపోజల్

భారత యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్.. ఓ అందమైన అమ్మాయి మనసు దోచేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వీక్షించడానికి వచ్చిన ఓ యువతి, గ్రౌండ్‌లోనే గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. 'మ్యారీ మీ.. శుభ్‌మాన్' అని రాసి ఉన్న ఫ్లకార్డును పట్టుకొని కెమెరా కంటపడింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇప్పటికే గిల్..  ఇద్దరు సారాలతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా, గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అనడానికి ఎలాంటి దాఖలాలు లేవు. అయితే సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌ విషయంలో మాత్రం ఆ వార్తలను కొట్టిపారేయాలం. వీరిద్దరూ హోటళ్లు, విమానాలలో చక్కర్లు కొడుతూ ఇప్పటికే కెమెరా కంటపడ్డారు. చూడాలి మరి ఈ అందగాడి జీవితంలోకి ఎవరు అడుగు పెడతారో..