పాంటింగ్ వార్నింగ్..ఈ ముగ్గురు డేంజర్..జాగ్రత్త

పాంటింగ్ వార్నింగ్..ఈ ముగ్గురు డేంజర్..జాగ్రత్త

2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానంలో  ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. 2023 జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గతేడాది WTC ఫైనల్ చేరినా..న్యూజిలాండ్ చేతిలో ఓడి ట్రోఫీని మిస్ చేసుకుంది టీమిండియా. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా WTC ఛాంపియన్ గా అవతరించాలని పట్టుదలతో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా బలాబలాలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. WTC ఫైనల్లో ఆసీస్ గెలవాలంటే ఏం చేయాలో సలహా ఇస్తున్నాడు. 

 
ఆసీస్ గెలవాలంటే..

WTC ఫైనల్లో ఆస్ట్రేలియా గెలవాలంటే ముగ్గురు వికెట్లు కీలకం అంటున్నాడు రికీ పాంటింగ్. ఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్లు విరాట్ కోహ్లీ, పుజారాలను త్వరగా ఔట్ చేయాలని సూచిస్తున్నాడు. లేకపోతే ఆసీస్ గెలవడం కష్టమవుతుందంటున్నాడు. ప్రస్తుతం ఆసీస్ టీమ్ కోహ్లీ గురించే మాట్లాడుకుంటుందని..అతడితో పాటు..పుజారాపై కూడా దృష్టి పెట్టాలంటున్నాడు. 

వీరిద్దరు కొరకరాయి కొయ్యలు..

ఆసీస్ కు కోహ్లీ, పుజారా కొరకరాని కొయ్యలుగా మారారని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరు ఆస్ట్రేలియా పిచ్ లపై అద్భుతంగా ఆడారు. అయితే ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం కూడా ఆస్ట్రేలియా పిచ్ లాగే ఉంటుంది కాబట్టి..అక్కడ కోహ్లీ, పుజారా చెలరేగుతారు. కాబట్టి వీరిద్దరి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని..బౌలర్లు కోహ్లీ, పుజారాలను ఔట్ చేస్తే ఆసీస్ పని మరింత సులువు అవుతుందని చెప్పారు. ఇక పుజారా కంటే కోహ్లీ మరింత డేంజర్ అని తెలిపాడు. ఐపీఎల్ 2023లో కోహ్లీ ఆడిన తీరు అమోఘమని..WTC ఫైనల్లో కోహ్లీని ఔట్ చేయాలంటే  ఆసీస్ బౌలర్లు మరింత శ్రమించాల్సి వస్తుందన్నాడు.  

కోహ్లీ, పూజారాతో పాటు..

కోహ్లీ, పుజారాతో పాటు..యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ పట్ల కూడా ఆసీస్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని పాంటింగ్ సూచిస్తున్నాడు. ప్రస్తుతం ఫాంను బట్టి చూస్తే..తుది జట్టులో గిల్ ఉండటం దాదాపు ఖాయమన్నాడు. ఈ క్రమంలో అతను చెలరేగితే ఆసీస్కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. వీరికితోడు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కూడా కంగారూలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ, పుజారా, గిల్ టీమిండియాలో కీలకం అని..ఈ ముగ్గురిని ఆసీస్ బౌలర్లు అడ్డుకోకపోతే WTC ఫైనల్లో ఆసీస్ నెగ్గడం కష్టమని పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.