X షాక్ : ఇండియాలో 5 లక్షల అకౌంట్స్ బ్యాన్

X షాక్ : ఇండియాలో 5 లక్షల అకౌంట్స్ బ్యాన్

X కార్ప్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఇండియన్ కస్టమర్లకు అకౌంట్ల తొలగింపులను కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటినుంచి  అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు చేసిన మొదట్లో బ్లూ టిక్ మార్క్ కోసం సబ్ స్క్రిప్షన్ పెట్టారు.  ఆ తర్వాత ఏకంగా ట్విట్టర్  ఖాతాదారులందరికి సబ్ స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే కొత్త ప్రతిపాదనలు చేశారు. తాజాగా ఖాతాల తొలగింపు ప్రక్రియను స్టార్ట్ చేసింది.. ఇప్పటికే జూన్, జూలై నెలల్లో లక్షల్లో ఖాతాదారులను తొలగించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 26 మధ్య కాలంలో దాదాపు అర మిలియన్ (5.59లక్షల) ఇండియన్ ఖాతాలను బ్యాన్ చేశారు. 

Also Read :- స్వల్పంగా పెరిగిన గోల్డ్, వెండి ధరలు

X కార్ప్ (గతంలో ట్విట్టర్) తొలగించిన ఖాతాల్లో చిన్న పిల్లల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన, ప్రోత్సహించే ఉన్నాయట. వీటితో పాటు టెర్రరిజాన్ని ప్రోత్సహించే 1675 ఖాతాలను కూడా తొలగించారట. ఈ అకౌంట్లను భారతదేశపు కొత్త IT నిబంధనలకు అనుగుణంగా X Corp తొలగించిందట. 
కంటెంట్ ను తొలగించడం, నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలనుంచి X Corp కు భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. వీటిలో ఇండియా నుంచి 3,076 ఫిర్యాదులు అందాయి. వీటిలో 83 శాతం ఫిర్యాదులను X Corp పరిష్కరించబడ్డాయి. 
2023 జూలై 26 నుండి ఆగస్టు 25 వరకు భారతదేశంలో 12.80 లక్షల ఖాతాలనుX Corp  తొలగించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 2,307 ఖాతాలను కూడా తొలగించారు. అదేవిధంగా, జూన్ 26 నుంచి జూలై 25 వరకు భారతదేశంలో 18.51 లక్షల ఖాతాలను నిషేధించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 2,865 ఖాతాలను తొలగించారు.