బీజింగ్: ప్రపంచం ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా అస్థిరతను ఎదుర్కొంటున్నదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. కొన్ని దేశాలు (అమెరికా) సాగిస్తున్న ఏకపక్ష చర్యలు, బెదిరింపు ధోరణి అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకోవడం, ఆ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జిన్‌పింగ్ తీవ్రంగా స్పందించారు.
వెనెజువెలా సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించలేదని, ఈ చర్య యునైటెడ్ నేషన్స్ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. బంధీలుగా ఉన్న నికోలస్ మదురో, ఆయన భార్య సిలియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
