హీరోయిన్‌‌‌‌‌‌‌‌కి వై-ప్లస్‌‌‌‌ సెక్యూరిటీ ఇస్తున్నారు.. మరి హత్రాస్‌‌‌‌‌‌‌‌ బాధిత కుటుంబానికి..?

హీరోయిన్‌‌‌‌‌‌‌‌కి వై-ప్లస్‌‌‌‌ సెక్యూరిటీ ఇస్తున్నారు.. మరి హత్రాస్‌‌‌‌‌‌‌‌ బాధిత కుటుంబానికి..?

కేంద్రాన్ని ప్రశ్నించిన శివసేన 

ముంబై: ఒక యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ప్లస్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. హత్రాస్‌‌‌‌‌‌‌‌ బాధిత కుటుంబానికి ఎందుకు భద్రత కల్పించడంలేదని శివసేన ప్రశ్నించింది. హత్రాస్‌‌‌‌‌‌‌‌లో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌రేప్‌‌‌‌‌‌‌‌కు గురై మరణించిన దళిత యువతి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని.. వారికి వై–ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీసింది. ఈమేరకు తన అధికార పత్రిక సామ్నాలో శివసేన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. పోయిన నెలలో ముంబై పోలీసులపై బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ యాక్ట్రెస్‌‌‌‌‌‌‌‌ కంగనా రనౌత్‌‌‌‌‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమెకు వై–ప్లస్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ కల్పించింది. ‘ముంబైకి చెందిన యాక్ట్రెస్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం వై–ప్లస్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఇచ్చింది. కానీ హత్రాస్‌‌‌‌‌‌‌‌లో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌రేప్‌‌‌‌‌‌‌‌ బాధితురాలి ఫ్యామిలీకి మాత్రం ఎటువంటి భద్రత కల్పించలేదు. రాజ్యాంగంలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన న్యాయం ఇది కాదు’ అని శివసేన పేర్కొంది.