
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన వై20 సిరీస్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి ఆన్‌లైన్ షాపింగ్ సైట్లతో పాటు రిటైలర్ల దగ్గరా లభిస్తాయి. ఈ నెల 28 నుంచి సేల్స్ మొదలవుతాయి. వై20 ఫోన్ 4జీబీ + 64జీబీ ధర 12,990. ఇందులో మూడు కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ 6.51ఇంచుల హాలో ఐవ్యూ డిస్లే , ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 18 వాట్స్ ఫాస్ట్‌చార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పీచర్లు ఉంటాయి. మరో ఫోన్ వై21ఐ ధర రూ.11,490లు. ఇందులో 3జీబీ ర్యామ్ మాత్రమే ఉంటుంది. రెండు ఫోన్లూ అండ్రాయిడ్ 10 ఓఎస్‌పై పనిచేస్తాయి.