గుండెపోటుతో బస్వాపూర్ భూ నిర్వాసితుడు మృతి

గుండెపోటుతో బస్వాపూర్ భూ నిర్వాసితుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా : బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. అధికారుల తీరుతోనే జూపల్లి నర్సింహా అనే వ్యక్తి చనిపోయాడంటూ బస్వాపూర్ రిజర్వాయర్ క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 

బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు గత 57 రోజులుగా ధర్నా చేస్తున్నారు. రోజుల తరబడి ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోకుండా తమ ఇండ్లకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల ఒత్తిడికి జూపల్లి నర్సింహా అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ.. భూ నిర్వాసితుల కుటుంబ సభ్యులు బస్వాపూర్ రిజర్వాయర్ క్యాంప్ ఆఫీస్ ముందు జూపల్లి నర్సింహా మృతదేహంతో ధర్నా నిర్వహిస్తున్నారు.