నీళ్ల చారుతో స్టూడెంట్స్ ఎట్లా తింటారు..ఏజెన్సీ నిర్వాహకులపై కలెక్టర్ సీరియస్

నీళ్ల చారుతో స్టూడెంట్స్ ఎట్లా తింటారు..ఏజెన్సీ నిర్వాహకులపై కలెక్టర్ సీరియస్
  • కలెక్టర్ ​హనుమంతరావు
  • మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశం 

ఆలేరు (యాదాద్రి), వెలుగు: మెనూ పాటించకుండా స్టూడెంట్స్​కు నీళ్ల పప్పుచారుతో భోజనం పెట్టడంపై యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు సీరియస్​ అయ్యారు. నీళ్ల చారుతో పిల్లలు భోజనం ఎలా తింటారని నిలదీశారు. జిల్లాలోని శారాజీపేట హైస్కూల్​ను మధ్యాహ్న భోజనం సమయంలో సందర్శించారు. స్టూడెంట్స్​ కోసం వండిన పదార్థాలను ఆయన పరిశీలించారు. కూరలకు బదులుగా చారుతోనే భోజ నం ఏర్పాటు చేసిన ఏజెన్సీపై ఆయన సీరియస్​ అయ్యారు. 

నీళ్లచారుతో పిల్లలు ఎలా భోజనం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం టెన్త్​ క్లాస్​ చదువుతున్న స్టూడెంట్స్​కు ఇప్పటి నుంచి స్పెషల్​ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. ఆలేరులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్‌‌ను పరిశీలించారు.   

ప్లానింగ్​తో వడ్ల కొనుగోలు చేయండి

యాదాద్రి, వెలుగు:  ప్లానింగ్​ ప్రకారం వడ్ల కొనుగోలు చేయాలని కలెక్టర్​ హనుమంతరావు ఆదేశించారు. కలెక్టరేట్లో వడ్ల కొనుగోలులపై ట్రైనింగ్​ ఇచ్చారు. ఈ సందర్భంగా కొనుగోలు సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు వివరించారు. తేమ, తాలు పర్సేంటేజీ ఎంత ఉండాలో తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా కొనుగోళ్లు నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, డీఆర్​డీవో నాగిరెడ్డి, సివిల్​ సప్లయ్​ డీఎం హరికృష్ణ, డీసీఎస్​వో రోజారాణి, డీఏవో వెంకట రమణారెడ్డి, డీసీవో శ్రీధర్​ ఉన్నారు.