యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ప్రారంభం, పైగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు.
 
కొండపైన ఉన్న కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి.. ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.

స్వామివారి ఆదాయం..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం(ఆగస్టు 20) నిత్య ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ స్వామి వారి ఆదాయం: రూ. 24,13,822/-, ప్రధాన బుకింగ్: రూ. 2,14,950/-, కైంకర్యములు: రూ. 2,901/-, సుప్రభాతం: రూ. 2,500/-, బ్రేక్ దర్శనం: రూ. 1,27,500 /-, వ్రతాలు: రూ. 1,86,400 /-, వాహన పూజలు: రూ. 16,100 /-, వీఐపీ దర్శనం: రూ. 1,65,000/-, ప్రచారశాఖ: రూ. 25,310/-, పాతగుట్ట: రూ. 38,090/-, కొండపైకి వాహన ప్రవేశం: రూ. 3,00,000/-, యాదఋషి నిలయం: రూ. 90,832/-, సువర్ణ పుష్పార్చన: రూ. 96,516 /-, శివాలయం: రూ. 7,400/-, పుష్కరిణీ: రూ. 1,850/-, ప్రసాదవిక్రయం: రూ. 8,98,820/-, శాశ్వత పూజలు: రూ. 25,000/-, కళ్యాణ కట్ట: రూ. 82,000/-, ఇతరములు: రూ. 10,000/-, అన్నదానం: రూ. 1,22,653 భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. .

మరోవైపు సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసం, ఆదివారం కావడంతో సంప్రదాయబద్దంగా మల్లన్నకు భక్తులు పట్నాలు, బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. తమ కోరికలు తీర్చమంటూ గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు.