అలర్ట్..సంప్రదాయ దుస్తుల్లో వస్తనే యాదాద్రి దర్శనం

అలర్ట్..సంప్రదాయ దుస్తుల్లో వస్తనే యాదాద్రి దర్శనం

యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు... లేని యెడల దర్శనానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఈ రూల్స్ 2024 జూన్ 1 నుండి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అలాగే యాదగిరిగుట్టపైకి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు.  మరోవైపు ఈ రోజు(మే 24) నుంచి ఆన్ లైన్ టికెట్లు సేవలు విడుదల చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక మే 24 శుక్రవారం రోజున యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి 2 గంటల  సమయం పడుతోంది.  ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శానానికి సుమారుగంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు.