
- విలేజ్ సెక్రెటరీలతో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
యాదాద్రి, వెలుగు: ‘మీ జీతం డబుల్పెరిగింది. రెగ్యులరైజ్చేయడానికి ఇంకా టైం పడుతుంది’ అంటూ విలేజ్ సెక్రెటరీలను ఉద్దేశించి సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పంచాయతీ సెక్రెటరీలతో శుక్రవారం హరితహారంపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేజ్ సెక్రెటరీ లేచి రెండేళ్ల తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. గడువు కూడా మరో ఏడాది పెంచారని చెప్పారు. దీంతో ప్రియాంక వర్గీస్స్పందిస్తూ మీ సమస్య సీఎం కేసీఆర్‌కు తెలుసు. జీతం కూడా రెండింతలు పెరిగింది. రెగ్యులరైజ్కావడానికి టైం పడుతుందని సమాధానమిచ్చారు. అనంతరం మరో సెక్రెటరీ లేచి ఉపాధి హామీ పథకం అమలులో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఇందులో ప్రాబ్లం ఏముంది.. కోఆర్డినేషన్‌తో పనులు చేయాలంటూ సూచించారు. అవసరమైతే సహాయకులను తీసుకోవాలన్నారు. అనంతరం ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ హరితహారం ప్రోగ్రాం బాగానే అమలు చేస్తున్నారని, ఎవెన్యూ ప్లాంటేషనే సరిగా లేదన్నారు. తాను వచ్చేలోగా సమస్యను అధిగమించాలని చెప్పారు. భువనగిరి మండలం తుక్కాపురంలోని 10 ఎకరాల్లో 31 వేల మొక్కలు నాటారని, ఇందుకు కారణమైన సెక్రెటరీ రాజును అభినందించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో జిల్లాలో 100 శాతం పచ్చదనం పెంపొందించాలని సూచించారు. మీటింగ్‌లో కలెక్టర్పమేలా సత్పతి, అడిషనల్కలెక్టర్దీపక్తివారి, సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సునంద, అడిషనల్ డీఆర్డీవో నాగిరెడ్డి ఉన్నారు.