యాదాద్రిలో వాటర్ పైప్ లైన్లు రిపేర్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్

యాదాద్రిలో  వాటర్ పైప్ లైన్లు రిపేర్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్

యాదాద్రి, వెలుగు:  పైప్​లైన్ల రిపేర్ల కారణంగా హెచ్​ఎడబ్ల్యూఎస్​ఎస్​ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేస్తున్నామని యాదాద్రి జిల్లా మిషన్​ భగీరథ ఎగ్జిక్యూటీవ్​ ఇంజినీర్​ కరుణాకరన్​ తెలిపారు. తుర్కపల్లి మండలం వెంకటాపూర్ లోని పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లీకేజీలు ఏర్పడ్డాయని చెప్పారు. వాటిని రిపేర్లు చేపట్టినందున నీటి సరఫరాను సోమ, మంగళవారాలు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్ (ఎం), భువనగిరి,  మోటకొండూరు, యాదగిరిగుట్ట, రాజాపేట, గుండాల,  తుర్కపల్లి, మండలాలతో పాటు యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 142 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదని  చెప్పారు. 10 నుంచి ఎప్పటిలాగానే నీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు.