కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసిన బీజేపీ నేత..అఖిలేష్ యాదవ్ వీడియో వైరల్

కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసిన బీజేపీ నేత..అఖిలేష్ యాదవ్ వీడియో వైరల్

లక్నో:యూపీలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను కిడ్నాప్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోలీసు లను కిడ్నాప్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలను యూపీ మాజీ సీఎం అఖలేష్ యాదవ్ సోషల్  మీడియలో  పోస్ట్ చేశారు. సాక్ష్యం ఇది చాలా..ఎఫ్ ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు బీజేపీ ఆఫీసుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. 

యూపీలోని చందౌలీ జిల్లాలో విద్యుత్ శాఖకు చెందిన కొంతమంది అధికారులు తనఖీలకు వచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు చెకింగ్ ల పేరుతో లంచం డిమాండ్ చేస్తున్నారని.. వారిపై బీజేపీ నేతలు దాడికి పడినట్లు తెలుస్తోంది. కొంతమంది బీజేపీ కార్యకర్తలు విద్యుత్ శాఖకు చెందిన పోలీసులను కారులో ఎక్కించి దాడి చేశారని పోస్ట్ లో తెలిపాడు అఖిలేష్ యాదవ్. 

ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ కార్యకర్తలు అని ఆరోపించిన కొంతమంది వ్యక్తులు విద్యుత్ శాఖ కానిస్టేబుల్ ను స్థానిక బీజేపీ నాయకుడి కారులో ఎక్కించి కొట్టడం కనిపిస్తుంది. 

విద్యుత్ శాఖ అధికారుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందుకున్న చందువాలి పోలీసులు బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.