ఈవీఎంల ట్యాంపరింగ్‌‌పై..యమధీర మూవీ

ఈవీఎంల ట్యాంపరింగ్‌‌పై..యమధీర మూవీ

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘యమధీర’.  ఆర్ శంకర్ దర్శకత్వంలో వేదాల శ్రీనివాస్ నిర్మించారు. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ

నిర్మాత డిఎస్ రావు అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. నిర్మాత వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పొలిటికల్ బ్యాక్‌‌డ్రాప్, ఈవీఎంల ట్యాంపరింగ్‌‌  అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం.  అజర్ బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం షూట్ చేశాం. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్‌‌తో

పాటు క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అలాగే  నాగబాబు, అలీ, సత్య ప్రకాష్,  మధుసూదన్ ఇతర పాత్రలు పోషించారు.  ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.