నడిరోడ్డుపై చొక్కా విప్పి సవాల్ చేసిన మంత్రి

నడిరోడ్డుపై చొక్కా విప్పి సవాల్ చేసిన మంత్రి

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రచ్చకెక్కుతుంది.  ప్రకాశం జిల్లా యర్రగొండంవారి పాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన తెలిపారు.  చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.    గతంలో చంద్రబాబు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. . చంద్రబాబు, లోకేష్ దళితులకు క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేస్తున్నారు.   ఇదిలా ఉండగా టీడీపీ కార్యకర్తలు మంత్రి సురేష్ ఇంటి వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.