ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డ్ ఆఫీసర్..మ్యుటేషన్ కోసం రూ.30 వేలు డిమాండ్

ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డ్ ఆఫీసర్..మ్యుటేషన్ కోసం  రూ.30 వేలు డిమాండ్

మేడ్చల్ వెలుగు :  పూర్వీకుల ఇంటిని వారసుల పేరుపై మ్యుటేషన్ చేసేందుకు రూ.30 లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ ఆఫీసు వార్డు ఆఫీసర్​ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఎల్లంపేట మున్సిపాలిటీ  వార్డు ఆఫీసర్​ డి.రవీందర్ రెడ్డి.. రావల్ కోల్ గ్రామానికి చెందిన వ్యక్తి తండ్రి పేరు మీద ఉన్న పూర్వీకుల ఇంటిని మ్యుటేషన్​ చేసేందుకు రూ.40 వేలు డిమాండ్ చేశాడు. 

చివరికి రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో వల పన్నారు. మున్సిపల్ ఆఫీసులో శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.