సింగి ల్ .. రెడీ టు మింగిల్..

సింగి ల్ .. రెడీ టు మింగిల్..
  • మాకు తోడెవరూ లేరనుకునే వాళ్లు పార్టీ చేసుకునేందుకే ఈ సింగిల్స్ డే

ఇవాళ సింగిల్స్‌‌ డే. ఇది ఓన్లీ సింగిల్స్‌‌ కోసమే. వాలంటైన్స్‌‌ డే అయిన తెల్లారే ఈ డే జరపటానికి ఓ కారణం ఉంది. ఫిబ్రవరి 14న ‘మాకు తోడు లేకపోయనే’ అని బాధపడిన వాళ్లంతా కలిసి పార్టీ చేసుకునేందుకు పెట్టారు దీన్ని. ఫ్రెండ్స్‌‌ కోసం సరదాగా మొదలుపెట్టిన ఈ డే తరువాత బాగా పాపులర్‌‌‌‌ అయిపోయింది. అలా ఇవాళ అంటే ఫిబ్రవరి 15న ‘సింగిల్స్‌‌ డే’గా మారింది. మనల్ని మనం ప్రేమించుకోవడం కంటే మించింది ఏముంటుంది? మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన లవ్‌‌. అలాంటప్పుడు మనకు వాలంటైన్‌‌ లేరు అనుకోవడం ఎందుకు? మనమే మన లోకాన్ని సృష్టించుకుని మనతో మనమే ఎంజాయ్‌‌ చేస్తే హాయిగా ఉండొచ్చంటారు చాలామంది. అలా అనుకునే వారి కోసం కూడా ఓ రోజు ఉంది అదే సింగిల్స్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ డే (ఏస్‌‌ఏడీ). ఫిబ్రవరి 15న దీన్ని సెలబ్రేట్‌‌ చేసుకుంటారు. ఈ రోజున సింగిల్స్‌‌ అందరూ కలిసి పార్టీలు చేసుకోవడం లేదా ఒంటరిగా టూర్లు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. చాలామంది తమ ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీతో కలిసి సింగిల్స్‌‌ డే పార్టీలు చేసుకుంటారు. ట్రావెలింగ్‌‌కి వెళ్లాలనుకునేవారు ఎక్కువగా బ్రెజిల్‌‌లో జరిగే కార్నివాల్‌‌కు వెళ్తారు. ఫారెన్‌‌లో ఈ సింగిల్స్‌‌ డే సెలబ్రేషన్స్‌‌ ఎక్కువగా జరుగుతాయి. సింగిల్స్‌‌ అంతా కలిసి పార్టీలు పెట్టుకుంటారు. గ్రాండ్‌‌గా గెట్‌‌ టుగెదర్‌‌‌‌ ఏర్పాటు చేసుకుంటారు. పార్టీకి వచ్చిన సింగిల్స్‌‌ తమకు నచ్చిన వారితో నెక్ట్స్‌‌ ఇయర్‌‌‌‌ వాలెంటైన్స్‌‌డే  కల్లా మింగిల్‌‌ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. కొందరైతే తమను తాము అర్థం చేసుకునేందుకు ఈ రోజు బాగా ఉపయోగ పడుతుందని, సెల్ఫ్‌‌ ఎనలైజ్​  చేసుకుని తమను తాము తీర్చి దిద్దుకుంటామని చెప్తున్నారు కూడా.

అసలు ఎట్ల వచ్చిందంటే?

మిసిసిపికి చెందిన డస్టిన్‌‌ బార్నెస్‌‌ 2001 నుంచి ఈ సింగిల్స్‌‌ డేని సెలబ్రేట్‌‌ చేయడం మొదలుపెట్టాడు. తమకు వాలంటైన్‌‌ లేదని బాధగా ఉన్న తన ఫ్రెండ్స్‌‌తో ఒక గ్రూప్‌‌ను క్రియేట్‌‌ చేసి వాలంటైన్స్‌‌డే తర్వాతి రోజే సింగిల్స్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ డే స్టార్ట్‌‌ చేశాడు. వాళ్లంతా హైస్కూల్‌‌లో ఉన్నప్పుడు స్టార్ట్‌‌ చేసిన ఈ డేని యూనివర్సిటీల్లోకి వెళ్లిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. 2005నుంచి దీన్ని అందరూ ఫాలో అవుతున్నారు. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే సింగిల్స్‌‌ డే కనిపెట్టిన డస్టిన్‌‌ బార్నెస్‌‌ ఒక చర్చిలో నిర్వహించిన సింగిల్స్‌‌ డే గ్రూప్‌‌ ఫంక్షన్‌‌లో పరిచయమైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట. అందుకే, చాలామంది ఈ పార్టీలకు అటెండై ‘సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే’ అని పాటలు పాడి అమ్మాయిలను కూడా పడేస్తున్నారు. ఈ ఏడాది సింగిల్స్‌డే చేసుకుని.. ఆ తర్వాతి ఏడాది వాలంటైన్స్‌డే చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. సింగిల్‌గా పార్టీకి వెళ్లి కపుల్‌గా తిరిగొస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు

విదేశాల ​వైపు సంపన్నుల పరుగు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌