సర్వ మానవాళికి భారత్ యోగా బహుమతి

సర్వ మానవాళికి భారత్ యోగా బహుమతి

న్యూఢిల్లీ: యోగా అనేది దేశ వారసత్వ సంపద అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి యోగా చేశారు. అనంతరం మాట్లాడుతూ... ప్రాచీన కాలం నుంచి యోగా అనేది మనలో భాగంగా ఉందన్నారు. సర్వ మానవాళికి భారత్ యోగాను బహుమతిగా ఇచ్చిందని తెలిపారు. ఆరోగ్యానికి యోగా మేలు చేస్తుందన్న రాష్ట్రపతి... యోగా మనస్సు, శరీరం, ఆత్మను సమతుల్యం చేస్తుందని చెప్పారు.